పుల్కల్ రూరల్, అక్టోబర్ 5 : సింగూరు ప్రాజెక్టుకు వరద అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టు లోకి వస్తున్న వరద తీవ్రతను బట్టి ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం ప్రాజెక్టు లోకి 20687 క్యూసెక్కుల నీరు వరద రూపంలో వచ్చి చేరుతుండగా అవుట్ ప్లో 24762 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.