నడిరోడ్డుపై కారు దగ్ధం.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు
car burnt | కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు చెలరేగి చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామశివారులో 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

సంగారెడ్డి : కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు చెలరేగి చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామశివారులో 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి పొగలు రాగానే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కారు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే కారు దగ్ధమైనట్లు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Road accident : ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం
విషాదం : ఆరెగూడెంలో వృద్ధ దంపతుల బలవన్మరణం
సినిమా షూటింగ్.. ఫిలింనగర్లో అగ్నిప్రమాదం
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

