హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని ఫిలింనగర్లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఫిలింనగర్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న జనరేటర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో అందులో డిజిల్ లీక్కావడంతో రోడ్డు పక్కన ఉన్న కారు, షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అగ్నిప్రమాదంతో షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.