ఆర్టీసీ ఆదాయానికి కొత్త మార్గాలు
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం, కార్గో సేవలతో ఆదాయం పొందుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత ఆదాయంపై దృష్టిసారించింది. ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసిన పట్టణాల్లో వృథాగా ఉన్న ఆర్టీసీ స్థలాలపై ఆదాయం వచ్చేలా ఆలోచన చేసింది.
- వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు అద్దెకు ఆర్టీసీ స్థలాలు
- సంగారెడ్డి డిపో పరిధిలో 30 దుకాణాల సముదాయానికి స్థల సేకరణ
- కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ
సంగారెడ్డి, జూన్ 23 : ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం, కార్గో సేవలతో ఆదాయం పొందుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత ఆదాయంపై దృష్టిసారించింది. ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసిన పట్టణాల్లో వృథాగా ఉన్న ఆర్టీసీ స్థలాలపై ఆదాయం వచ్చేలా ఆలోచన చేసింది. సంగారెడ్డి ఆర్టీసి డిపో పరిధిలోని సదాశివపేట, జోగిపేట, దౌల్తాపూర్ బస్టాండ్లలో దుకాణాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇప్పటికే కొనసాగుతున్న దుకాణాలతో పాటు ఖాళీ స్థలాల్లో కొత్త దుకాణాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తున్నది. సంగారెడ్డి డిపో పరిధిలో 30 దుకాణాల ఏర్పాటుకు ప్రస్తుతం టెండర్లు స్వీకరిస్తున్నట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. దుకాణాల ఏర్పాటుకు ఒక దరఖాస్తుకు రూ.1180 చెల్లించి టెండర్ ఫారం కొనుగోలు చేయాలని, అవి డిపో కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. జూలై 1 వరకు టెండర్ దాఖలు చేయవచ్చని డిపో మేనేజర్ తెలిపారు. జూలై 2న సీక్రెట్ టెండర్ల విధానంలో దుకాణాల కేటాయింపులు జరుగుతాయని, దరఖాస్తు ఫారంపై దుకాణం నంబరు ఉంటుందని, ఈ విషయాన్ని దరఖాస్తుదారులు గమనించాలని కోరారు.
టెండర్లు వేసేందుకు రూ.25వేల డీడీ కార్యాలయంలో సమర్పించాలని, టెండర్లో దరఖాస్తుదారు పేరు రాకుంటే తిరిగి డీడీలు వాపస్ చేస్తామని ప్రకటించారు. టెండర్లో దుకాణం వస్తే సొంతంగా షెడ్ నిర్మాణం చేసుకుని వ్యా పారం చేస్తూ ప్రతినెలా ఆర్టీసీకి అద్దె కట్టాలి. ఐదెండ్ల కాలపరిమితితో దుకాణాల ఏర్పాటుకు అనుమతించారు. సంగారెడ్డిలోని 12/15 విస్తీర్ణం గల 25 దుకాణాలకు రూ.25వేల డీడీ కట్టి టెండర్ పాల్గొనాల్సి ఉంటుంది. 24/15 విస్తీర్ణం గల 5 దుకాణాలకు రూ.50వేలు డీడీ చెల్లించి టెండర్ వేయాలి. వీటితో పాటు కారు, ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన 8 వేల చదరపు అడుగుల స్థలం టెండర్‌కు రూ.1.50 లక్షల డీడీ చెల్లించి పాల్గొనాలని డిపో మేనేజర్ సూచించారు. ఇప్పటికే సదాశివపేట, జోగిపేట, దౌల్తాబాద్ బస్టాండ్లలో దుకాణాలకు టెండర్లలో పాల్గొని ఉపాధి పొందుతున్న యజమానులు తిరిగి ఆయా బస్టాండ్లలో దుకాణాలకు టెండర్లు వేయాలని అధికారుల సూ చిం చారు.
ఆర్టీసీ మనుగడకే దుకాణాల ఏర్పాటు..
ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు డిపో పరిధిలోని ఖాళీ స్థలంలో దుకాణాల ఏర్పాటు కు ప్రణాళికలు తయారుచేశాం. డిపో పక్కన కల్వకుంట రోడ్డు లో కొత్త దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకున్నాం. ఒకేసారి 30దుకాణాల ఏర్పాటుతో కొందరికి ఉపాధి దొరకడంతో పాటు ఆర్టీసీకి ఆదాయం సమకూరనున్నది. టెండర్లు వేసిన దుకాణాలను యజమానులే షెడ్‌తో నిర్మాణం చేసుకుని టెండర్లో వేసిన కోడ్ ప్రకారం ప్రతినెలా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఐదేండ్ల కాల పరిమితితో దుకాణాలు కేటాయిస్తున్నాం. డిపో ఆవరణలోని మిగతా ఖాళీ స్థలంలో డీమార్ట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ట్లు గుర్తించారు. డీమార్ట్ ప్రతినిధులు సర్వే చేసి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అందుకే ఆ స్థలా న్ని టెండర్ కోసం ప్రతిపాదనలో పొందుపరుచలేదు.
– ఉపేందర్, డిపో మేనేజర్ సంగారెడ్డి
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

