సెలవులు కావొద్దు భారం
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.
- మేలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు
- పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు
- సెలవులు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేలా ఉండాలని సూచన
సిటీబ్యూరో, మే14 (నమస్తే తెలంగాణ): ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశాయి. దీంతో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. మే మాసంలో ఉష్ణోగ్రతలు 41డిగ్రీలకు చేరుకోనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల్లో పొంచివున్న డీహైడ్రేషన్ ప్రమాదం
డీ హైడ్రేషన్(నిర్జలీకరణ)అంటే శరీరంలోని నీరు ఆవిరైపోవడం. ముఖ్యంగా ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి వ్యాధి నిరోదక శక్తి తక్కువగా ఉండడం వల్ల పిల్లలు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారని నిలోఫర్ సూపరింటెండెంట్ డా.ఉషారాణి తెలిపారు. ఎక్కువగా ఎండలో తిరగం, వడగాల్పులకు గురవడంతో ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. అంతే కాకుండా వేసవిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుందన్నారు. పిల్లలు ఎండలో తిరగడం వల్ల శరీరంలోని లవణాలు, నీరు వాతావరణంలోని ఉష్ణోగత్రకు ఆవిరైపోతుందని, దీంతో పిల్లలు నీరసించి పోతారన్నారు. పిల్లల్లో ‘హీట్ రెగ్యులేషన్ సిస్టమ్’ తక్కువస్థాయిలో పనిచేయడం వల్ల వారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని, అందువల్ల పిల్లలను సాధ్యమైనంత వరకు ఎండల్లో బయటకు తీసుకెళ్లక పోవడమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు భానుడి ప్రతాపానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు. చిన్నపిల్లలు డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్(వడదెబ్బ), హెపటైటిస్ తదితర సమస్యల బారిన పడే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉదయం నుంచే ఎండల తీవ్రత పెరిగి అతినీలలోహిత కిరణాలు వెలువుడుతుండడంతో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు నిలోఫర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రాథమిక చికిత్స విధానం..
డీహైడ్రేషన్‌కు గురైన పిల్లలను వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలి. పిల్లలకు ఓఆర్ఎస్ ద్రవాన్ని కొద్ది కొద్దిగా తాగించాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేకపోతే ఇంట్లో కాచి, చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, చిటికెడు చెక్కరను కలిపి ఆ ద్రవాన్ని తాగించాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి నీళ్లు తాగించడం ఉత్తమం. వాంతులు, విరేచనాలు నియంత్రణ కాకపోతే వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి.
డీహైడ్రేషన్ లక్షణాలు
- వాంతులు, విరేచనాలు
- నీరసం
- కళ్లు లోపలికి వెళ్లినట్లు కనిపించడం
- నోరు ఎండిపోవడం
- శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం రావడం
- మూత్రం రాకపోవడం
- మూత్రంలో మంట, పసుపు, ఎరుపు రంగులో మూత్రవిసర్జన
డీహైడ్రేషన్ ప్రమాదకరం
పిల్లలు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయి. డీహైడ్రేషన్‌కు గురై వాంతులు, విరేచనాలుతో బాధపడితే వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. ఎక్కువ శాతం ద్రవ పదార్థాలు ఇవ్వాలి. బయటి ఆహారానికి దూరంగా ఉంచాలి. పిల్లలను బయటకు పంపాల్సి వస్తే ఎండ తగల కుండా తలకు టోపి, లోదా గొడుగు వంటివి వినియోగించాలి. ఎండలో బయటకు వెళ్లే పిల్లలకు వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేయాలి.
– డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్ దవాఖాన
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

