హత్నూర, ఆగస్టు 9: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర లేబర్వెల్ఫేర్బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన హత్నూరలో రూ.75లక్షల 50వేలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంతోపాటు రూ.2 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ సారథ్యంలో గ్రామాలు అభివృద్ధిబాటలో పరుగులు పెడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో బీడుభూములు సస్యశ్యామలం అవుతున్నాయన్నారు. నిరంతర విద్యుత్‌తో రైతన్నలు సంతోషంగా పంటలు పండిస్తున్నట్లు గుర్తుచేశారు. పల్లెప్రగతిలో గ్రామాలు ఎంతో అభివృద్ధిని సాధించాయన్నారు. రాష్ట్రంలో సాధించిన అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. హత్నూరలో రూ.7కోట్ల50లక్షలతో డబుల్‌రోడ్డు నిర్మాణం, కోటి రూపాయలతో దోబీఘాట్లు, రూ.50లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు వారు తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన సర్పంచ్, వార్డు మెంబర్లు..
హత్నూర మండలం బ్రాహ్మణగూడ గ్రామసర్పంచ్ మొగులయ్యతోపాటు నలుగురు వార్డుసభ్యులు వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మరోమారు బీఆర్ఎస్ అధికారంలోకివచ్చి చరిత్ర సృష్టించనున్నదన్నారు.
ప్రజాప్రతినిధులకు ఘనస్వాగతం..
మండల కేంద్రమైన హత్నూరలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి స్థానిక సర్పంచ్ వీరస్వామిగౌడ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంలో ఊరేగింపుగావెళ్లి పలువార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామంలో ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు చేపడుతున్న సర్పంచ్‌ను వారు అభినందించారు. కార్యక్రమం లో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, తహసీల్దార్ సంధ్య, ఎంపీడీవో శారదాదేవి, ఎంపీవో సువర్ణ, పీఏసీఎస్ చైర్మన్లు దుర్గారెడ్డి, దామోదర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కిష్టయ్య, శివశంకర్‌రావు, రవి, ఆశయ్య, రాములు, వెంకటేశంగౌడ్, దుర్గేశ్వర్‌రెడ్డి, పెం టేశ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఆయాగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.