ప్రకృతిహితం.. ప్లాస్టిక్‌పై సమరం
ఆహారం అనుకుని మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని మృతి చెందిన ఘటనలను చూసి ఆమె చలించింది. ఎలాగైనా తనవంతుగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని తలచింది. పర్యావరణానికి మేలు చేసే జ్యూట్ బ్యాగుల తయారీని ఎంచుకుని ఆదర్శంగా నిలుస్తున్నది హుస్నాబాద్‌కు చెందిన మాతంగి ఉమారాణి.
- పర్యావరణ పరిరక్షణ.. ప్రతిఒక్కరి బాధ్యత
- ప్రజల మేలుకోరి.. జ్యూట్ వస్తువుల తయారీ
- అందరూ జ్యూట్ బ్యాగులు వాడాలని ప్రచారం
- హుస్నాబాద్‌లో ప్రత్యేకంగా దుకాణం ఏర్పాటు
- ఆదర్శంగా నిలుస్తున్న హుస్నాబాద్‌కు చెందిన మాతంగి ఉమారాణి
ఆహారం అనుకుని మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని మృతి చెందిన ఘటనలను చూసి ఆమె చలించింది. ఎలాగైనా తనవంతుగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని తలచింది. పర్యావరణానికి మేలు చేసే జ్యూట్ బ్యాగుల తయారీని ఎంచుకుని ఆదర్శంగా నిలుస్తున్నది హుస్నాబాద్‌కు చెందిన మాతంగి ఉమారాణి.
హుస్నాబాద్ టౌన్, జనవరి 9: కుటుంబానికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలిగించుకునేందుకు ఏదో ఒక పని చేయాలని హుస్నాబాద్‌కు చెందిన మాతంగి ఉమారాణి నిర్ణయించుకుంది. కానీ, పదిమందికి మేలు చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు ఉపయోగపడే విధంగా పర్యావరణానికి మేలు చేసే పనులు చేయాలని భావించి రెండేండ్లలో అనుకున్న పని చేసింది.

ప్లాస్టిక్ కవర్లతో జరిగే అనర్థాలు..
మార్కెట్లో మనం ఉపయోగించే ప్లాస్టిక్ కవర్ల వల్ల జరిగే అనర్థాలు గుర్తించకపోవడంతో పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలుగుతున్నది. ప్లాస్టిక్ కవర్లు బయట పారేస్తే అవి భూమిలో కలిసిపోయేందుకు సంవత్సరాలు పడుతుండడంతో దానివల్ల ఏర్పడుతున్న సమస్యలను గుర్తించింది. భూగర్భ జలాలు ఇంకిపోకుండా ప్లాస్టిక్ కవర్లు అడ్డుగా ఉండడంతోపాటు మురుగు కాల్వల్లో చేరి పలురకాల వ్యాధులకు కారణమవుతున్న విషయాన్ని గమనించింది. ఎలాగైనా ప్లాస్టిక్‌ను నివారించాలనే పట్టుదలతో ముందుకు సాగింది.
రూ.1400తో వ్యాపారం ప్రారంభం
వరంగల్‌కు వెళ్లి జ్యూట్ వస్తువుల తయారీపై ఉమారాణి శిక్షణ తీసుకుంది. టైలరింగ్‌లో అనుభవం ఉండడంతో రూ.1400 పెట్టుబడితో జ్యూట్ వస్తువులు విక్రయించే వ్యాపారాన్ని హుస్నాబాద్‌లో ప్రారంభించింది. జ్యూట్‌తో ముందుగా మనీ పర్సులను తయారు చేసింది. ఈ విషయాన్ని తనకు తెలిసిన మహిళలకు చెప్పి కొనుగోలు చేయాలని, ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయని వివరించినా మొదట్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అయినా తయారీ చేయడం మాత్రం ఆమె ఆపలేదు. ప్రజలకు పర్యావరణ స్ప్రహ పెరగడం, ప్రభుత్వం సైతం ప్లాసిక్ట్ కవర్ల వినియోగాన్ని నిషేధించడంతో జ్యూట్ వస్తువుల వినియోగం పెరిగింది.
26 రకాల జ్యూట్ బ్యాగుల తయారీ
26 రకాల జ్యూట్ బ్యాగులు, వస్తువులు తయారు చేస్తూ విక్రయిస్తున్నది. ప్రతి ఒక్కరూ నిత్యం ఉపయోగించే మనీపర్సు, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్, పూజా సామగ్రి, ఫ్రిజ్ కవర్లు, హ్యాండ్స్ బ్యాగ్స్, కూరగాయల బ్యాగ్స్, శారీస్, మొబైల్ పౌచ్ తదితర వస్తువులను వినియోగించుకునే విధంగా జ్యూట్ వస్తువులను తయారు చేస్తున్నది. రూ.80 నుంచి రూ.500 వరకు దొరికే వస్తువులను ఆమె తయారు చేస్తూ, విక్రయిస్తూ పర్యావరణానికి తనవంతు కృషి చేస్తున్నది.
సమాజాన్ని కాపాడుకోవాలి
సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. సమాజం బాగుండాలంటే పర్యావరణం బాగుండాలే అనే ఆలోచన చేయాలి. ప్లాస్టిక్ కవర్లతో ఎదురవుతున్న ఇబ్బందులు తన మనస్సును తీవ్రంగా కలిచివేసింది. అందుకే మా ఇంట్లో ప్లాస్టిక్ వాడడం మానేశాం. భూమిలో కలిసిపోయే జనపనారతో తయారు చేసే జ్యూట్ బాగులను వినియోగించాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలి.
– మాతంగి ఉమారాణి, హుస్నాబాద్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

