మెదక్ అర్బన్, డిసెంబర్ 9 : సమాజంలోని సకల వివక్షకు మూ లం అవిద్య, అజ్ఞానం అని.. విద్యాభ్యాస సమయంలో చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో ‘లింగ వివక్షత లేని సమాజం- జాతీయు ఉద్యమం’ అనే ఆంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ ఆడపిల్లలు కష్టపడి చదువుకోవాలని, చదువు చాలా ముఖ్యమన్నారు.
ఆడపిల్లలు విద్యావంతులైతే సమాజాభివృద్ధిలో క్రియాశీలక పాత్రను పోషించాలని సూచించారు. యువత కాలాన్ని వృథా చేసుకుని సామాజిక మాద్యమాలకు బానిస కావడం ఆందోళనకరమన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లలు, యువతపై ఉండడంతో వారిలో క్రీయాశీలత లోపిస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను సక్రమ మార్గంలో పెట్టేందుకు సామాజిక మాధ్యమాలకు దూరం ఉంచాలని సూచించా రు. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుని, తద్వారా భావోద్వేగ సమతుల్యతను పాటిస్తూ ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ పట్టణ సీఐ మధు, రూరల్ సీఐ విజయ్, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఉమారాణి పాల్గొన్నారు.
రోడ్డు భద్రత పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ
ట్రాక్టర్ల కేజ్వీల్స్తో బీటీరోడ్డు, సీసీరోడ్లపై నడపడంతో రోడ్లు పూర్తి గా ధ్వంసమవుతాయని ఎస్పీ రోహిణిప్రియదర్శిని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రోడ్డు భదత్ర అవగాహనలో భాగంగా ఎంవీఐతో కలిసి ఎస్పీ రోహిణిప్రియదర్శిని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ట్రాక్టర్లను కేజ్వీల్స్తో రోడ్లపై నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పొల్లాలో ఉపయో గించే కేజ్వీల్స్తో రోడ్లపై రావడం సరికాదని, కేజ్వీల్స్తో రోడ్లపైకి వచ్చే ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.