రామాయంపేట, జూన్ 6: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో మెదక్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. కోమటిపల్లికి చెందిన సంగం మహిపాల్(30) శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా రామాయంపేట శివారులో లారీ ఢీకొని మృతి చెందాడు.
ఈ ఘటనలో మృతుడి బైక్ నుజ్జునుైజ్జెంది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.రామాయంపేట పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు.కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై బాలరాజు తెలిపారు. మెదక్ జిల్లా ఏఎస్పీ వీకే సింగ్ కోమటిపల్లిలో కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సీఐ సైదా నాయక్, ఎస్సై బాలరాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని ఏఎస్పీ భరోసా ఇచ్చారు. అధికార లాంచనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు నిర్వహించారు.