ప్రజలకు ఎల్లమ్మతల్లి ఆశీస్సులు ఉండాలి
చిన్నకోడూరులోని ఎల్లమ్మ దేవాలయ అష్టమ వార్షికోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మంగళవారం హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
చిన్నకోడూరు, ఏప్రిల్ 23: చిన్నకోడూరులోని ఎల్లమ్మ దేవాలయ అష్టమ వార్షికోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మంగళవారం హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎల్లమ్మతల్లి ఆశీస్సులతో మనం చేసే కార్యం సఫలం కావాలన్నారు. గ్రామస్తులకు అన్నింటా శుభం చేకూరాలని కోరుకున్నారు.. గౌడకుల సంఘం ప్రతినిధులు హరీశ్‌రావుని సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఆలయాలను సందర్శించిన హరీశ్‌రావు
నంగునూరు, ఏప్రిల్ 23: మండలంలోని పలు ఆలయాలను మాజీ మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. జేపీతండాలో దుర్గావీరాంజనేయస్వామి నూతన ఆలయ ప్రతిష్ఠాపన, రాంపూర్‌లోని సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, గట్ల మల్యాల గ్రామంలో ఎల్లమ్మ దేవాలయ ప్రతిష్ఠ, అంక్షాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నాలుగో వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
జక్కాపూర్‌లో…
నారాయణరావుపేట, ఏప్రిల్ 23: మండల పరిధిలోని జక్కాపూర్‌లో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు, నారాయణరావుపేటలో బీరప్ప ఉత్సవాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు.
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి
అక్కన్నపేట, ఏప్రిల్ 23: ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆకాంక్షించారు. మండలంలోని మసిరెడ్డితండాలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్ హరీశ్‌రావుకు స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో తండావాసులు పాల్గొన్నారు.
ఎల్లమ్మతల్లిని దర్శించుకున్న హరీశ్‌రావు
వర్గల్, ఏప్రిల్ 23: మండలంలోని మజీద్‌పల్లిలో జరుగుతున్న రేణుకాఎల్లమ్మతల్లి వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన ఎల్లమ్మదేవి కల్యాణం, గౌరంగం తదతర పూజల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు.ఆయన వెంట ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ, ఎంపీపీ, మాజీ సర్పంచ్, గౌడసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

