వైన్స్‌లు.. సిండికేట్ల చేతికి!
2025-27 సంవత్సరానికి లక్కీడిప్ ద్వారా మద్యం షాఫులు దక్కించుకున్న వారు నేటినుంచి ఓపెన్ చేయనున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో షాప్‌లు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల కిక్కు కలిసిరానున్నది. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ వైన్స్‌లు లిక్కర్ సిండికేట్ల చేతికి చేరాయి. లాటరీలో వైన్స్‌లు దక్కిన వారితో లిక్కర్ సిండికేట్ బేరసారాలు ఆడి షాప్‌లను దక్కించుకుంటున్నారు.
- ఉమ్మడి మెదక్ జిల్లాలో మెజార్టీ వైన్ షాపులు సిండికేట్లకు సొంతం
- లాటరీ తగిలిన వారి నుంచి గుడ్‌విల్ ఇచ్చి సొంతం
- డిమాండ్ ఉన్న వైన్స్‌లకు రూ. కోటి నుంచి కోటిన్నర వరకు ఆఫర్
- చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆబ్కారీ శాఖ
- ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరిగిన తతంగం..?
- నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు షురూ
సిద్దిపేట, నవంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి): 2025-27 సంవత్సరానికి లక్కీడిప్ ద్వారా మద్యం షాఫులు దక్కించుకున్న వారు నేటినుంచి ఓపెన్ చేయనున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో షాప్‌లు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల కిక్కు కలిసిరానున్నది. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ వైన్స్‌లు లిక్కర్ సిండికేట్ల చేతికి చేరాయి. లాటరీలో వైన్స్‌లు దక్కిన వారితో లిక్కర్ సిండికేట్ బేరసారాలు ఆడి షాప్‌లను దక్కించుకుంటున్నారు.ఈ సిండికేట్లలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సైతం ఫిర్యాదుల అందాయి. కానీ, చర్యలు తీసుకోవడం లేదు. ఒక్కో మద్యం దుకాణానికి కోటిన్నర వరకు గుడ్‌విల్ ఇచ్చి లిక్కర్ సిండికేట్ వాళ్లు తీసుకున్నట్లు తెలిసింది. పలుచోట్ల గుడ్‌విల్‌కు లొంగకపోతే బెదిరించి వైన్స్‌లను లిక్కర్ సిండికేట్ తమ చేతికి తీసుకున్నట్లు తెలిసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో లాటరీలో దక్కింది ఒక్కరైతే..షాపు నిర్వాహణ మరొకరి చేతికి వెళ్లి పోయింది. జిల్లాలో లిక్కర్ సిండికేట్ల హవా నడుస్తోంది. వీరికి ఆబ్కారీ శాఖ అధికారులు వంతపాడినట్లు సమాచారం. కొత్తగా వైన్స్ షాప్‌లు దక్కిన వారికి అనుభవం లేదని, వ్యాపారంలో రాణించలేరని, సిండికేట్లు అడిగిన కాడికి షాప్‌లు ఇచ్చి డబ్బులు తీసుకోవాలని స్వయంగా ఆబ్కారీ శాఖ అధికారులు ఉచిత సలహాలు ఇచ్చి మరీ సిండికేట్ల చేతికి వైన్స్‌షాప్‌లు వెళ్లేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైన్స్‌షాప్ డిమాండ్‌ను బట్టి రూ. 30 లక్షల నుంచి రూ. కోటిన్నర వరకు గుడ్‌విల్ ఇచ్చినట్లు తెలిసింది. అప్లికేషన్ ఫీజుతో పాటు లిక్కర్ బిజినెస్‌ను బట్టి రెండేండ్ల పాటు గుడ్‌విల్ చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్, పటాన్‌చెరుతో పాటు సంగారెడ్డి జిల్లాలోని కొన్ని షాపులకు, సిద్దిపేట,మెదక్ జిల్లాలో కొన్ని షాపులకు కోటిన్నర వరకు ఆఫర్ పలికింది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

