ఇంటి పార్టీ బీఆర్ఎస్
‘కాంగ్రెస్, బీజేపీలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేయాలి. ఎన్నికలప్పుడు వచ్చే పార్టీలను నమ్మకండి. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండే బీఆర్ఎస్ను నమ్మండి. గులాబీ జెండాతోనే ఢిల్లీలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది.
- జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర సూపర్‌హిట్
- ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం
- కాంగ్రెస్, బీజేపీలను పాతరేయాలి
- ఎన్నికలప్పుడు వచ్చే నాయకలను నమ్మకండి
- బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పక్కా లోకల్
- రూ.100 కోట్లతో వెంకట్రామిరెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాడు..
- ట్రస్ట్‌తో పేదలకు మేలు జరుగుతుంది..
- గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్
- బీడీ కార్మికులు, కార్మికుల పొట్టగొట్టిన బీజేపీ
- ‘నమస్తే తెలంగాణ’తో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట, మే 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కాంగ్రెస్, బీజేపీలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేయాలి. ఎన్నికలప్పుడు వచ్చే పార్టీలను నమ్మకండి. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండే బీఆర్ఎస్ను నమ్మండి. గులాబీ జెండాతోనే ఢిల్లీలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ. ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో అంతా ఆగమైంది’..అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ‘రేవంత్‌రెడ్డి పాలనలో కల్యాణలక్ష్మి చెక్‌లు బౌన్స్ అవుతున్నాయి.
తులం బంగారం జాడలేకుండా పోయింది. ఆరుగ్యారంటీల్లో ఐదు ఇచ్చామని బోగస్ మాట్లాడుతున్నారు. ఆరింటిలో ఒకటి మాత్రమే పాక్షికంగా అమలైంది. కాంగ్రెస్ గ్యారెంటీలు గాలిలో దీపాలుగా మారాయి. బీజేపీ అబద్ధ్దాల ప్రచారం, ఫేక్ వీడియోలు తప్పా మరోటి లేదు. కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే ..ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉంది.జిల్లాలోని పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటాం. కేసీఆర్ బస్సుయాత్రలు జిల్లాలో సూపర్ హిట్ అయ్యాయి’..అ ని హరీశ్‌రావు చెప్పారు. ‘నమస్తే తెలంగాణతో ఆది వారం ప్రత్యేకంగా’ మాట్లాడారు. వారి మాటల్లోనే …
వెంకట్రామిరెడ్డి పక్కా లోకల్
మెదక్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని పట్టుకుని రేవంత్‌రెడ్డి నాన్ లోకల్ అని మాట్లాడుతున్నాడు. సీఎం మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టుగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, ప్రజల చేత తిరస్కరించబడ్డ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్‌లో టికెట్ ఇచ్చిందన్నారు. మా మెదక్ అభ్యర్థిని పట్టుకొని ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మీరు టికెట్ ఎలా ఇచ్చారని మొన్న నర్సాపూర్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మీరు ఎందుకు జీవన్‌రెడ్డికి టికెట్ ఇచ్చారో సమాధానం చెప్పాలి..? చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు. ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌కు సికింద్రాబాద్ టికెట్ ఎందుకు ఇచ్చారు. ..? బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తీసుకొని, ఆయనకు మరో నాలుగున్నరేండ్ల పదవి ఉంది కదా…! వీటికి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి.
వెంకట్రామిరెడ్డిని పట్టుకొని ఆయన కరీంనగర్ నుంచి వచ్చాడు అని మాట్లాడుతారు. ఆయన సర్వీసులో సగభాగం మెదక్ జిల్లాలోనే పనిచేశారు. ఆయన స్థిర నివాసం సంగారెడ్డి జిల్లాలోనే, సీఎం వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి. నీవు అచ్చంపేట నుంచి కొడంగల్‌కు పోయి పోటీ చేయవచ్చు, కొడంగల్‌లో ఓడిపోతే వచ్చి మల్కాజిగిరిలో పోటీ చేయవచ్చు. రేవంత్‌రెడ్డి మల్కాజిగిరిలో పోటీచేస్తే ఒప్పు అయినప్పుడు, వెంకట్రామిరెడ్డి పక్కా లోకల్ మెదక్ ప్రజలకు ఎనలేని సేవలు అందించి ఇక్కడ పోటీచేస్తే ఎలా తప్పు అయితది. రేవంత్‌రెడ్డి కేవలం బురద చల్లడం కోసం మాట్లాడుతున్నారు తప్పా మరోటి లేదన్నారు.
బీఆర్ఎస్ బలంగా ఉంది.. విజయం మాదే
మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు శాసనసభ స్థానాల్లో ఆరుస్థానాలు గెలిచినం. ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది. గతంలో కూడా అన్ని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్సే విజయం సాధించింది. ఇప్పుడు కూడా కచ్చితంగా విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఉన్నది ఒక్కటే మెదక్ ఎమ్మెల్యే వాళ్లకు.ఆ ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఈసారి మెదక్ అసెంబ్లీలో బీఆర్ఎస్ మెజార్టీ సాధిస్తామనే విశ్వాసం నాకు ఉంది. అక్కడ మంచి స్పందన వస్తున్నది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో పార్టీకి మంచి స్పందన ఉంది. మా పార్టీ అభ్యర్థి అక్కడ మంచి మెజార్టీతో గెలుస్తాడు.
పనిచేయని కాంగ్రెస్, బీజేపీలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేయాలని ప్రజలను కోరుతున్నా. ఎన్నికలప్పుడు వచ్చే పార్టీలను నమ్మకండి. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండే బీఆర్ఎస్ను నమ్మండి. గులాబీ జెండాతోనే ఢిల్లీలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది. ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో అంతా ఆగమాగమైంది. గుండె మీద చెయ్యే సి ఆలోచించండి. గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందించిన కేసీఆర్ గెలవాల్నా.. గ్యారెంటీల పేరు మీద మనల్ని మోసం చేసే రేవంత్‌రెడ్డి మళ్లీ గెలవాల్నా ఆలోచన చేయా లె. 6 గ్యారెంటీల విషయం లో మోసం చేసిన కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించాలనుకుంటున్నరు. అందుకే నిన్న రాహుల్‌గాంధీ మీటిం గ్ అట్టర్‌ప్లాప్ అయింది. కేసీఆర్ మీటింగులు సూపర్ హిట్ అయ్యాయి.
కల్యాణలక్ష్మి పథకం చెక్‌లు బౌన్స్ .. తులం బంగారం తుస్సు
రేవంత్‌రెడ్డి పాలనలో కల్యాణలక్ష్మి పథకం చెక్‌లు బౌన్స్ అవుతున్నాయి. తులం బంగారం తుస్సు అయ్యింది. ఆరుగ్యారెంటీల్లో ఐదు ఇచ్చామని బోగస్ మాట్లాడుతున్నారు. ఆరింటిలో ఒకటి మాత్రమే పాక్షికంగా అమలైంది.కాంగ్రెస్ గ్యారెంటీలు గాలిలో దీపాలుగా మారాయి. ఆరింటిలో ఐదు గ్యారెంటీలు అమలు కాలేదు. 1) మహాలక్ష్మి (మహిళలకు నెలకు 2500), 2) చేయూత (నాలుగు వేల పింఛన్),3) విద్యార్థులకు భరోసా (ఐదు లక్షల కార్డు), 4) రైతుభరోసా( ఎకరానికి రూ1500, వడ్లకు మక్కలకు బోనస్ 500), 5) ఇండ్ల స్థలాలు, ఇండ్లు రాలేదు. ఇవీన్న ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ రేవంత్‌రెడ్డి ఐదు అమలు అయ్యాయని తప్పు మాట్లాడుతున్నాడు.
అబద్ధ్దాలు ప్రచారం చేస్తున్నారు. మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఉచిత కరెంట్ విషయంలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. 201 యూనిట్ అయితే మొత్తం బిల్లు వస్తున్నది. మీటర్ రీడింగ్ ఎప్పుడు తీస్తున్నారు. 30 రోజులకు కాకుండా 35 రోజులకు వస్తే ఆ రీడింగ్ 201 దాటుతుంది. దాంతో ప్రజలకు నష్టం జరుగుతున్నది. 200 వరకు ఫ్రీగా ఇవ్వాలి కదా, అలా ఇవ్వడం లేదు. 201 యూనిట్లు పడగానే మొత్తం బిల్లు కట్టించుకుంటున్నారు. 200 యూనిట్లు దాటితే పై దానికి బిల్లు వేయాలి. కానీ, అలా వేయకుండా మొత్తం పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది.గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకు పెట్టాలి. కారు గుర్తుకు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ ఆరుగ్యారెంటీల అమలుకు రూట్‌గా మారుతది. సురుకు పెడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్ధం అవుతుంది.
దుబ్బాకలో చెల్లనిది .. మెదక్ పార్లమెంట్లో చెల్లుతుందా ?
బీజేపీ అభ్యర్థి రఘునందన్ గత ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. తన విశ్వసనీతను కోల్పోయాడు. ఆయనను మెదక్ పార్లమెంట్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయనవి మాటలు తప్ప చేతలు లేవన్న విషయం ప్రజలకు అర్థమైంది. బీజేపీ అభ్యర్థికి ఓటేయడం అంటే మెదక్ పార్లమెంట్లో నీళ్లు లేని బాయిల దూకినట్టే అయితదని ప్రజలు అనుకుంటున్నరు. గతంలో ఉప ఎన్నికల్లో అనేక హామీలిచ్చి సొంతంగా చేస్తానన్న పనులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి చేయిస్తానన్న పనులు కానీ ఏమీ జరుగలేదు. క్యాలెండర్లు పంచి ఓట్లు అడుగుతున్నడు. క్యాలెండర్లు ప్రజల కడుపు నింపవు. బీజేపీ గెలిచినా ఏమీ ఒరగదని ప్రజలకు అర్థమైంది.
నాలుగు నెలల కిందనే దుబ్బాక ప్రజలు నీ పనితీరు బాగా లేదని దుబ్బాకలో ఆయనను 54 వేల ఓట్లు.. బహుశా రాష్ట్రంలో వన్ఆఫ్దా హైఎస్ట్ మెజార్టీ.. అంటే అంత చిత్తుగా నిన్ను ఓడగొట్టిన్రు. మూడు నెలల కింద నువ్వు దుబ్బాకలో పనికి రానోడివి.. మెదక్‌ల ఎట్ల పనికొస్తవు. మెదక్ పార్లమెంట్లో ఎట్ల చేస్తవు. ప్రజలు ఆలోచిస్తున్నరు. దుబ్బాక ప్రజలకు ఇచ్చిన హామీని నిలుపుకోలేని వ్యక్తి రేపు మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఏ రకంగా హామీలు నిలుపుకుంటారని ప్రజలు ఆలోచిస్తున్నరు. దుబ్బాకలో చెల్లని రూపాయి రేపు మెదక్‌ల ఎట్ల చెల్లుతది, సంగారెడ్డిలో ఎట్ల చెల్లుతది, సిద్దిపేటల ఎట్ల చెల్లుతది. నువ్వు మంచిగ పనిచేస్తే నిన్ను దుబ్బాకల్నే గెలిపించికుందురు కదా.. కనుక దుబ్బాకలో ఓడించారు.
బీజేపీవి అసత్యాలు, గ్లోబెల్స్ ప్రచారాలు
బీజేపీ అభ్యర్థి ఎప్పుడూ అసత్యాలు, గ్లోబెల్స్ ప్రచారం మీద ఆధారపడుతాడు. పోయిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక ప్రముఖ టీవీ చానల్ పేరిట కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నాడని కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాడని ఒక తప్పుడు వీడియోను ఎన్నికల సమయానికి కొద్ది గంటల ముందు విడుదల చేసి రాజీయంగా లబ్ధిపొందే ప్రయత్నం చేశారు. ఫేక్ వీడియోలను తప్పుడు వార్తలను సోషల్ మీడియా వేదిక ప్రచారం చేస్తున్నారు.
దయచేసి యువత, ప్రజలు ఫేక్ వీడియోలను, సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. ఎందుకంటే వాళ్ల గత చరిత్ర అట్ల ఉంది. ఇవాళ కొన్ని బోగస్ సర్వేలను కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియాలో విడుదల చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నయి. ఎంఆర్ఎఫ్, గణపతి షుగర్స్, వివిధ యూనియన్ సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేసి లేబర్ యూనియన్లను, కార్మికులకును మోసం చేశారు. అక్కడ కార్మికుల నుంచి ఆయన తీవ్రవ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడిగా పనిచేసే చోట హామీలు నిలుపుకోలేదు. వ్యతిరేకంగా ఉన్న బీజేపీపై కార్మికులు కోపంగా ఉన్నారు.
బీడీ కార్మికులకు 30 ఏండ్లు పనిచేస్తేనే పీఎఫ్, పెన్షన్ అని.. రెక్కాడితే డొక్కాడని బీడీ కార్మికులకు ఉన్న పీఎఫ్ పెన్షన్‌ను బీజేపీ తీసేసింది. మనకు వచ్చేదే 500 – 1000 రూపాయలు, ఆ వచ్చే పీఎఫ్ పెన్షన్‌కు కఠిన నిబంధనలు పెట్టి పీఎఫ్ పెన్షన్‌కు బీడీ కార్మికులను దూరం చేసింది. అదే బీడీ కార్మిలకు కేసీఆర్ రూ.2 వేల భృతి ఇచ్చి వారిని కాపాడుకున్నారు. బీడీ కట్టల మీద 28శాతం జీఎస్టీ విధించిన బీజేపీని ఓడించాలని బీడీ కార్మికులందరూ కసిగా ఉన్నారు. కఠినమైన చట్టాలు తెచ్చి కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న బీజేపీపై కార్మికులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.
రూ. 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు
రూ. 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తాను అని మా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఉద్యోగ మేళాలు, యువత కలల సాకారం చేయనున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టి, ఉచితంగా పేదింటి శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 ఏండ్ల పాటు ఒక అధికారిగా, కలెక్టర్‌గా సేవలందించారు. అభివృద్ధిలో భాగస్వామి అయ్యారు. ఒకవైపు సేవలందిస్తూనే ..మరోవైపు సహాయం కోరి వచ్చిన వారికి వెంకట్రామిరెడ్డి అండగా నిలిచారు.
నాలుగు పార్టీలు మారిన కాంగ్రెస్ అభ్యర్థి
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నాలుగు నెలల్లో నాలుగు పార్టీలు మారిండు. కాంగ్రెస్ జెండాలు తగలబెట్టి కాంగ్రెస్‌ను ఓడించండి అని చెప్పిన వ్యక్తి నీలం మధు. ఇవాళ ఆ పార్టీ శ్రేణులు ఎవరూ కూడా ఆయనకు పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన వంద రోజుల సమయం దొరికింది. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి…కోడ్ అని సన్నాయి నొక్కులు నొక్కారు. అది కాం గ్రెస్ ఫెయిల్యూర్.. వాస్తవానికి ఒక చెక్కు బౌన్స్ అయితే చట్టం ప్రకారంగా శిక్ష పడతది.
బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తమ ఓట్ల రూపంలో శిక్ష వేయాలని పిలుపునిస్తు న్నా. కాంగ్రెస్ పార్టీ జెండాలు తగలబెట్టి, కాళ్లతో తొక్కి కాంగ్రెస్‌ను ఓడించుమన్న నేతలకు మీరు ఇవాళ టికెట్లు ఇచ్చారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండాలు తగల బెట్టారో..ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు విరుద్ధంగా వాళ్లకే జెండాలు ఇచ్చి పార్టీనీ నడుపుమని చెబుతున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎలా ఓట్లు వేస్తారు. నాలుగు నెలల్లో నాలుగు పార్టీలు మారినవాడికి, సిద్దిపేటలో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుమని చెప్పిన వాడికి ఎలా ఓట్లు వేస్తారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

