నేటి నుంచి సీఎం కప్ పోటీలు
నేటి నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయిలో నిర్వహించే సీఎం కప్-2023 పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కప్-2023 పేరిట నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడలకు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. 15 నుంచి 36 ఏళ్ల వయస్సున్న మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్రీడలు నిర్వహించనున్నారు.
- 24వరకు జిల్లా స్థాయి క్రీడలు
- ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
- పాల్గొననున్న మండల స్థాయి విజేత జట్లు
- సంగారెడ్డి అంబేద్కర్ మైదానం, మెదక్ జూనియర్ కళాశాల మైదానం, ఇందిరాగాంధీ స్టేడియం, ఇండోర్ స్టేడియాల్లో నిర్వహణ
- అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
మెదక్ మున్సిపాలిటీ, మే 21: నేటి నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయిలో నిర్వహించే సీఎం కప్-2023 పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కప్-2023 పేరిట నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడలకు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. 15 నుంచి 36 ఏళ్ల వయస్సున్న మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్రీడలు నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
సోమవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానం, ఇందిరాగాంధీ స్టేడియం, ఇండోర్ స్టేడియాల్లో ఈ పోటీలు జరుగనున్నాయి. జిల్లా స్థాయిలో 11 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తారు. పురుషులకు బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తారు. మండల జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

