సంగారెడ్డి కలెక్టరేట్ అదుర్స్
సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు అరుదైన గౌరవం దక్కింది. కలెక్టరేట్లో మెరుగైన పాలన, నిర్వహణ, భద్రత, పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన్ అంతర్జాతీయ సంస్థ
- దక్కిన ఐఎస్వో 9001,14001 సర్టిఫికెట్లు
- త్వరలో కలెక్టర్‌కు అందజేయనున్న మంత్రి హరీశ్‌రావు
- కలెక్టరేట్లో మెరుగైన పాలన, పర్యావరణ పరిరక్షణలో కృషిని గుర్తించిన ఐఎస్వో సంస్థ
- ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ కలెక్టరేట్
- హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు, సిబ్బంది
సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు అరుదైన గౌరవం దక్కింది. కలెక్టరేట్లో మెరుగైన పాలన, నిర్వహణ, భద్రత, పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన్ అంతర్జాతీయ సంస్థ ఐఎస్వో 9001ః2015, 14001 సర్టిఫికెట్లను ప్రకటించింది. ఈ రెండు విభాగాలకు సంబంధించి గతంలోనే అధికారులు దరఖాస్తు చేసుకోగా, ఇటీవల సంస్థ సభ్యులు కలెక్టరేట్‌ను సందర్శించి పరిశీలించారు. త్వరలోనే మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి కలెక్టర్ శరత్‌కుమార్‌కు సర్టిఫికెట్లను అందజేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మోడల్ కలెక్టరేట్‌ను సంగారెడ్డిలో నిర్మించగా, తెలంగాణ ఏర్పడ్డాక అన్ని జిల్లాల్లో ఇదే తరహా సమీకృత కలెక్టరేట్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ప్రస్తుతం అన్ని చోట్లా పనులు జోరుగా సాగుతున్నాయి.
– సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ఫిబ్రవరి 11
సంగారెడ్డి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి కలెక్టరేట్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మోడల్ కలెక్టరేట్‌గా నిర్మితమైన సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్‌కు ఐఎస్ఓ 9001ః2015 సర్టిఫికెట్, ఐఎస్ఓ 14001 సర్టిఫికెట్లకు ఎంపికైంది. గుడ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బాగుండడంతో క్వాలిటీ మేనేజెమెంట్ స్టాండర్స్‌కు ఈ కలెక్టర్‌రేట్ ఐఎస్ఓ 9001ః2015 సర్టిఫికెట్‌కు ఎంపికైంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఐఎస్ఓ 14001 సర్టిఫికెట్‌కు కలెక్టరేట్‌ను ఎంపిక చేశారు. త్వరలోనే ఐఎస్ఓ సంస్థ సర్టిఫికెట్లను జారీ చేయనున్నది. ఈ రెండు సర్టిఫికెట్లను ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు త్వరలోనే జిల్లా కలెక్టర్ శరత్‌కు అందజేయనున్నారు.
రాష్ట్రంలోని తొలిసారి…
రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా అన్ని ప్రభుత్వశాఖలకు ఒకేచోట కార్యాలయాలు ఉండేలా సంగారెడ్డిలో సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. సువిశాల స్థలంలో రెండు అంతస్తులతో సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ సంగారెడ్డి కలెక్టరేట్ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన్(ఐఎస్ఓ) ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, భద్రత, నాణ్యమైన సేవలు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తికర స్థాయిలో ఉంటే ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్‌ను జారీచేస్తుంది. సంగారెడ్డి కలెక్టరేట్ 9001 సర్టిఫికెట్ కోసం ఇదివరకే దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు, అధికారుల పేర్లను ఏర్పాటు చేయడంతో పాటు అధికారుల వివరాలు, అందించే సేవలను తెలియజేస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సూచికలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, ప్రతిశాఖలో ఉద్యోగుల పనితీరుపై మూల్యాంకనం, స్టేటస్ రిపోర్టుల నిర్వహణ, సాధారణ ప్రజల సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, సమస్యల పరిష్కారం వివరాలను పొందుపర్చడం తదితర ఐఎస్ఓ ప్రామాణాలను కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలు పాటించాయి. ఇటీవలే ఐఎస్ఓ అధికారుల బృందం కలెక్టరేట్‌ను తనిఖీ చేసి ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్ జారీకి అవసరమైన ప్రామాణికాలు కలెక్టరేట్లోని కార్యాలయాలు పాటిస్తున్నది లేనిది పరిశీలించింది. ఐఎస్ఓ ప్రామాణికాలకు అనుగుణంగా కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ బాగుండంతో ఐఎస్ఓ సంగారెడ్డి కలెక్టరేట్‌కు ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్‌కు ఎంపిక చేసింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఐఎస్ఓ 14001 సర్టిఫికెట్ కోసం కలెక్టరేట్ అధికారులు దరఖాస్తు చేశారు.
ఈ సర్టిఫికెట్ పొందడానికి కలెక్టరేట్ ఆవరణలో గార్డెన్ అభివృద్ధి చేసి పలురకాల మొక్కలు పెంచారు. వర్షం నీటిని ఒడిసి పట్టేందుకు వీలుగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ మొక్కల సంరక్షణను దత్తత తీసుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. కలెక్టరేట్లో నాటిన ప్రతి మొక్క వయస్సు, ఉపయోగాలను బోర్డు ద్వారా ప్రదర్శిస్తున్నారు. గాలి, భూమి, నీటి కాలుష్యం పరీక్షలు చేయించారు. ఇటీవలే ఐఎస్ఓ అధికారుల బృందం సంగారెడ్డి కలెక్టరేట్ సందర్శించింది. సమీకృత కలెక్టరేట్లో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం ఎలా ఉందో పరిశీలించింది. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఐఎస్ఓ ప్రామాణాలకు అనుగుణంగా ఉండటంతో ఐఎస్ఓ 14001 సర్టిఫికెట్‌కు ఎంపిక చేసింది. త్వరలోనే ఈ సర్టిఫికెట్లను ఐఎస్ఓ జారీ చేయనున్నది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

