నారాయణఖేడ్/ కల్హేర్/ సిర్గాపూర్/ కంగ్టి, అక్టోబర్ 25:రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్‌తో పాటు కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్ మండలాల పరిధిలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమైక్య పాలనలో ప్రభుత్వాలు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ హయాంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, చెరువుల పునరుద్ధరణ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. వరి కొనుగోళ్లకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సహకరించకపోయినా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. – నారాయణఖేడ్/కంగ్టి/కల్హేర్/సిర్గాపూర్, అక్టోబర్ 25
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండల పరిధిలోని సంజీవన్‌రావుపేట, కల్హేర్ మండల కేంద్రంతో పాటు మార్డి, బాచేపల్లి, సిర్గాపూర్ మండలం కడ్పల్, కంగ్టి మండలం దామరిగిద్ద, బాన్సువాడ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు పండిన ప్రతిగింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
ఆయా కార్యక్రమాల్లో సంజీవన్‌రావుపేట సర్పంచ్ విఠల్, ఐకేపీ ఏపీఎం టిక్యానాయక్, కల్హేర్ మండలంలో జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఎంపీపీ గుర్రపు సుశీల, ఆత్మకమిటీ చైర్మన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంసింగ్, సర్పంచ్ కిష్టారెడ్డి, ఎంపీటీసీ సంగప్ప, పీఏసీఎస్ చైర్మన్ గంగారెడ్డి, ఏఈవో సతీశ్, మండల కో-ఆప్షన్ మెంబర్ గణి, నాయకులు బాలయ్య, నర్సింహగౌడ్, హన్మంత్‌రావు, సుధాకర్, లక్ష్మయ్య, కుమ్మరి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్లు, సిర్గాపూర్ మండలంలో జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కృష్ణమూర్తి, సర్పంచ్ సంజీవరెడ్డి, ఐకేపీ సీసీ సంతోష్, ఏఈవో భార్గవ్ , ఎంఎస్ లీడర్లు సునీత, కవిత, కంగ్టి మండలంలో ఎంపీపీ సంగీతావెంకట్రెడ్డి, జడ్పీటీసీ కోట లలితాఆంజనేయులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగారం, ఐకేపీ ఏపీఎం ధన్రాజ్గిరి, సీసీ అనుసూయ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.