నారాయణఖేడ్, అక్టోబర్ 25: ఈ నెల 19న పట్టణంలోని ఏఎస్ నగర్ లో జరిగిన చోరీ అంతర్రాష్ట దొంగల ముఠాను అరెస్టు చేశారు. సోమవా రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాలాజీ వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న పట్టణంలోని ఏఎస్ నగర్లో తాళం వేసి ఉన్న మ్యాడం సంతోశ్ ఇంట్లో చోరీకి పాల్పడి 19తులాల బంగారం, వెండి అభరణాలతో పాటు రూ.లక్ష నగదును గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లిన విషయం విధితమే. సోమవారం ఉదయం నిజాంపేట్ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపడుతుండగా హైదరాబాద్ వైపు నుంచి నారాయణఖేడ్ వైపు వస్తున్న మహారాష్ట్ర పాసింగ్ గల వాహనాన్ని వాహనాన్ని నిలిపి వాహనంలో సోదాలు చేయగా, వాహనంలో ప్రయాణిస్తున్న వారి వద్ద 19 తులాల బంగారం, ఒక ఇనుప రా డ్, స్క్రూ డ్రైవర్ లభించాయన్నారు. వాహనంలో ప్ర యాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఏఎస్ నగర్లో జరిగిన దొంగతనం తామే చేసినట్లు అం గీకరించారు.
పట్టుబడిన వారు సుఖదేవ్ మారుతి పవా ర్, బళిరాం విశ్వనాథ్, సంజయ్ హనుమంత్ కాళే, రాజు ప్రకాశ్ మంజుల్వర్, లక్ష్మణ్ హనుమంత్ పవార్లుగా గుర్తించడం జరిగిందన్నారు. వీరందరూ మహా రాష్ట్రలోని పలు జిల్లాలకు చెందిన వారని తెలిపారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ పలు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఐదుగురు నిందితుల్లో సంజ య్ హనుమంత్ కాళే పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామన్నా రు. ఏఎస్ నగర్ చోరీ కేసును వేగవంతంగా ఛేదించడమే కాకుండా అంతర్రాష్ట్ర దొంగల ము ఠాను పట్టుకోవడంలో సమర్థవంతంగా పని చేసిన సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ వెంకట్రెడ్డిలను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ వెంకట్‌రెడ్డి ఉన్నారు.