మెదక్ మున్సిపాలిటీ/ చిలిపిచెడ్/ రామాయంపేట/ చేగుంట, అక్టోబర్ 25 : పాక్షిక సూర్యగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి జిల్లా కేంద్రం మెదక్‌లోని ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి, బుధవారం నుంచి భక్తులకు దైవ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆయా ఆలయాల అర్చకులు తెలిపారు.
చాముండేశ్వరీ ఆలయం మూసివేత..
చిలిపిచెడ్ మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులోని మంజీరా నది సమీపంలో వెలిసిన చాముండేశ్వరీ ఆలయా న్ని సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి మూసివేసిన్నట్లు అర్చకుడు ప్రభాకరశర్మ తెలిపారు. చండూర్లోని రామలింగేశ్వర ఆలయాన్ని మూసివేశారు.
4:45 నుండి 6:39 గంటల వరకు గ్రహణం
నేటి సూర్యగ్రహణం మహిమతో కూడినది.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య పండితులు రామ్మోహన్‌శర్మ, శివకుమార్, శ్రీకంత్శర్మ తెలిపారు. సూర్య గ్రహణం సందర్భంగా ముఖ్యంగా గర్భిణులు జాగ్రత్తగా ఉండాలన్నారు. బుధవారం ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారన్నారు.
చేగుంట, నార్సింగి మండలాల్లోని ఆలయాలను ఉదయా న్నే మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయాలను తెరిచి శుద్ధజలాలతో సంప్రోక్షణ చేసి, ప్రత్యేక పూజలు చేశారు.