రామాయంపేట, ఫిబ్రవరి 22 : మన ఊరు-మనబడికి ఎంపికైన పాఠశాలలకు ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తున్నదని దానికి సంబంధించిన వివరాలను తెలుపాలని రామాయంపేట మండల విద్యాధికారి గంగాబాయి, ఎంపీడీవో.యాదగిరిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, ఏఈ కుశాల్లు అన్నారు. మంగళవారం రామాయంపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక బాలికల పాఠశాలతో పాటు ఎంపికైన ఐదు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి హెచ్ఎంల ద్వారా వివరాలను సేకరించారు. మన ఊరు మనబడికి ఎంపికైన బడులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని అందుకోసం ఎంపికైన పాఠశాలల హెచ్ఎంలు పాఠశాలలో బెంచీలు, గదుల కొరత, పిల్లలకు ఆటవస్తువులు, టీచర్ల కొరత తదితర ఇబ్బందులు ఏమైనా ఉంటే నివేదికలో పొందు పర్చాలని సూచించారు. కర్యాక్రమంలో కాలేరు ప్రసాద్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు సవి త, రాధిక, రాములు, భాస్కర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో సమస్యల గుర్తింపు
వెల్దుర్తి : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలలను పరిశీలించి సమస్యలను గుర్తిస్తున్నట్లు ఎంపీడీవో జగదీశ్వరాచారి, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండలంలోని దామరంచ, రామాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలను పరిశీలించి అదనపు గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు సమస్యలను గురించి, వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్ర భుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పించి, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. మొదటి విడుతలో వెల్దుర్తి మండలంలో 12, మాసాయిపేట మండలంలో 5పాఠశాలలు ఎంపికయ్యాయని, ఆయా పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సంఖ్య, అదనపు గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలతో పాటు సమస్యలు, అవసరమైన సదుపాయాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీరివెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
మౌలిక వసతుల వివరాల సేకరణ
మెదక్ మున్సిపాలిటీ : మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ఎంపికైనా జిల్లా కేంద్రంలోని కొలిగడ్డ బాలికల పాఠశాలను మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డీఈ మహేశ్ పాఠశాలను సందర్శించారు. మంగళవారం ప్రధానోపాధ్యాయు డు రవి, పాఠశాల కమిటీ చైర్మన్‌తో కలిసి వసతులు, సదుపాయాల వివరాలను సేకరించారు. పాఠశాలకు కావాల్సిన వసతుల వివరాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రధానోపాధ్యాయుడికీ సూచించారు. నివేదికల ప్రకరామే వసతులు సమకూర్చడం జరుగుతుందన్నారు.
పాఠశాలలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
నర్సాపూర్ : నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 5 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించామ ని తెలిపారు.పాఠశాలలకు కావాల్సిన సదుపాయాలను నోట్ చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాఠశాలల పరిశీలన
తూప్రాన్ : మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్, కిష్టాపూర్, వెంకటాయపల్లి గ్రామాల్లో పాఠశాలలను అధికారులు పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్లు, కిచెన్షెడ్లు, బెంచీలు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ తదితర మౌలిక వసతుల కల్పనకు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తూప్రాన్ ఏపీవో సంతోష్‌రెడ్డి తెలిపారు.