ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
రామాయంపేట పట్టణంలో పెద్దమ్మ ఉత్సవాలు
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
రామాయంపేట, మార్చి 25 : ప్రభుత్వం ఆలయాల అభివృ ద్ధికి పెద్దపీట వేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయంపేట లోని పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలకు హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ఆలయ కమిటీ సభ్యు లు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, నాయకులు పుట్టి యాదగిరి, దేవుని నర్సింహులు, పుట్టి అక్షయ్‌కుమార్, సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, వేణు, రవితేజ, శివప్రసాద్‌రావు తదితరులున్నారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు.
ఘనంగా పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలు
రామాయంపేటలో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనం గా జరుగుతున్నాయి. శుక్రవారం మొదలైన ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి కల్యాణోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్ర్తాలు, పుస్తెమట్టెలను సామాజిక సేవకుడు ఆంజనేయులు అందజేశారు.
ఘనంగా నల్లపోచమ్మతల్లి జాతర
శివ్వంపేట, మార్చి 25 : మండలంలోని ఏదుల్లాపూర్ గ్రా మంలో నల్లపోచమ్మ జాతర శుక్రవారం ప్రారంభమైనది. జాతర కు ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, కేహెచ్ఆర్ ట్రస్టు చైర్మన్ కల్లూరి హనుమంతరావు, సర్పంచ్ కీర్తన, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సీనియర్ నేత గొర్రె వెంకట్‌రెడ్డి, సినీప్లాంట్ అధినేత మల్లారెడ్డి ముఖ్య అతిథిలుగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కల్యాణం, అగ్నిగుండాలు, బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో ఎంపీటీసీ ఆకుల ఇందిరాశ్రీనివాస్, ఉప సర్పంచ్ పాండురంగం, మాజీ సర్పంచ్‌లు సునందరెడ్డి, మ్యాకల యాదిరెడ్డి, నాయకులు కల్లూరి ముత్యాలు, షఫియొద్ద్దీన్, బొ ద్దుల భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి బట్టాచార్య పాల్గొన్నారు.