గజ్వేల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీ హాల్లో గురువారం ప్రమాణస్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి విషెస్ తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడంతో గజ్వేల్ కార్యకర్తల్లో జోష్ వచ్చింది. ప్రమాణ స్వీకారం అనంతరం కేసీఆర్ కార్యకర్తలను స్వయంగా కలుస్తారని ఇటీవల గజ్వేల్‌లో జరిగిన పార్టీ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
కేసీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సునీతాలక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాణిక్‌రావు, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాయకులు హాజ రయ్యారు. ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి.. కేసీఆర్‌ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.