గజ్వేల్, ఏప్రిల్ 19: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం ఉదయం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఇన్స్ఫైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3కే రన్ నిర్వహించారు. ఈ రన్లో పట్టణంలోని యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అదనపు సీఐ ముత్యంరాజు హాజరై మాట్లాడారు. యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ముందస్తుగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయ డం అభినందనీయమన్నారు.
యువతకు మరింత అవగాహన కల్పించాలన్నా రు. డ్రగ్స్ నిర్మూలనకు సమాజాన్ని చైతన్య పర్చాలని, ప్రజలందరూ డ్రగ్స్ నిర్మూలనకు నడుం బిగించాలన్నారు. ప్రతి ఒక్క రూ బాధ్యతగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ రన్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులను అందజేశారు. ఫౌం డేషన్ ప్రతినిధులు, ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు.