నానో టెక్నాలజీతో అపార అవకాశాలు
సుస్థిర సమాజ నిర్మాణంలో నానో టెక్నాలజీకి అపార అవకాశాలు ఉన్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. హెల్త్‌కేర్, కమ్యూనికేషన్, ఇంధనం, ఇతర ఎన్నో తయారీ రంగాల భవిష్యత్తును నానోటెక్నాలజీ రూపుదిద్దుతుందన్నారు.
- ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి
కంది, జూలై 19 : సుస్థిర సమాజ నిర్మాణంలో నానో టెక్నాలజీకి అపార అవకాశాలు ఉన్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. హెల్త్‌కేర్, కమ్యూనికేషన్, ఇంధనం, ఇతర ఎన్నో తయారీ రంగాల భవిష్యత్తును నానోటెక్నాలజీ రూపుదిద్దుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఆదివారం బెంగళూర్‌లోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ (సీఈఎన్ఎస్) సహకారంతో నానో జాతా 2026 జాతీయ స్థాయి విజ్ఞాన విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. శాస్త్రీయ విజ్ఞానం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సమాజానికి చేరవేసేందుకు ఐఐటీహెచ్ కృషి చేస్తున్నదన్నారు.
సీఈఎన్ఎస్ డైరెక్టర్, నానో జాతా జాతీయ సమన్వయకర్త బీఎల్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలంటే బహుళశాఖల పరిజ్ఞానం కలిగిన పరిశోధకులు అవసరం అన్నారు. రోజాంతా సాగిన ఈ కార్యక్రమంలో నానో క్విజ్ పోటీలు, ఉపన్యాసాలు, సైన్స్ రోడ్ షోలు, విద్యార్థుల ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్లు విశేష ఆకర్శనగా నిలిచాయి. రోజువారి జీవితంలో ఉపయోగించే సాంకేతికతల వెనుక ఉన్న శాస్ర్తాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రదర్శనలు నిర్వహించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

