ట్రెండీ టాటూస్..క్రేజీ లుక్
ప్రస్తుతం యువతలో టాటూ క్రేజ్ నడుస్తున్నది. సందర్భం ఏదైనా ఒంటిపై నచ్చిన డిజైన్ వేయించుకుని నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని కోరుకుంటున్నారు.
- యువతలో పెరుగుతున్న క్రేజ్
- నగరాల నుంచి పట్టణాలకు విస్తరించిన కల్చర్
- శుభకార్యాలు, పార్టీలు, పండుగల రోజుల్లో డిమాండ్
- మదిలోని భావాలకు ప్రతిరూపం టాటూ
- ఆకట్టుకుంటున్న ైస్టెలిష్ డిజైన్లు
- అందుబాటులో నచ్చిన రంగులు
- స్వయం ఉపాధి పొందుతున్న పలువురు యువకులు
ప్రస్తుతం యువతలో టాటూ క్రేజ్ నడుస్తున్నది. సందర్భం ఏదైనా ఒంటిపై నచ్చిన డిజైన్ వేయించుకుని నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని కోరుకుంటున్నారు. నగరాల నుంచి చిన్న చిన్న పట్టణాలకూ ఈ కల్చర్ పాకడంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. మనసులోని భావాలకు ప్రతిరూపం గా, ఇష్టమైన అంశానికి తగ్గట్టుగా హీరోలు, ప్రేమికులు, కార్లు, బైక్‌లు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు, కొటేషన్లు, దేవుళ్లు ఇలా నచ్చిన బొమ్మలు వేయించుకుంటున్నారు. కొంతమంది కేవలం రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఒంటిపై డిజైన్ కావాలని, మరికొంత మంది శాశ్వతంగా ఉండిపోవాలని నిర్వాహకులకు ముందే చెబుతున్నారు. ఒకప్పుడు కేవలం గ్రీన్ కలర్ ఒక్కటే అందుబాటులో ఉండగా నేడు మరెన్నో రంగులు వచ్చాయి. మార్కెట్లో టాటూలకు డిమాండ్ పెరుగుతుండడంతో పలువురు ఔత్సాహికులు స్థానికంగా సెంటర్లను ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు. డిజైన్‌ను బట్టి రూ. వెయ్యి నుంచి రూ.8వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు.

మెదక్ రూరల్, నవంబర్ 27: ప్రస్తుత కాలంలో టాటూ ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు విదేశాలు, దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించిన ఈ కల్చర్ నేడు ఓ మోస్తారు పట్టణాలకు పాకింది. నాడు పచ్చబొట్టు నేడు టాటూ పేరేదైనా నేటి యువతలో మాత్రం దీనిపై విపరీతమైన క్రేజ్ వచ్చింది. పెండ్లిళ్లు, యూత్ పార్టీలు, పండుగలు, గెట్ టు గెదర్ సందర్భం ఏదైనా ఒంటిపై టాటూ పడాల్సిందే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు వైవిధ్యంగా కనిపించాలని శరీరమంతా డిజైన్ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారి పేర్లు, దేవుళ్లు, అభిమాన హీరోలు, కొటేషన్లు, కార్లు, బైక్‌లు ఇలా మనసుకు నచ్చిన వాటిని టాటూగా ఎంచుకుంటున్నారు.
తమ ఆలోచనా విధానం, సమాజంలో హాట్ టాపిక్, ఫ్యాషన్, ప్రకృతి తదితర అంశాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొందరు ైస్టెల్ కోసం మరికొందరు ప్రేమను వ్యక్తపరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు రకరకాల టాటూ డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. సింపుల్ టాటూ నుంచి రకరకాల బొమ్మల టాటూలు, నార్మల్, పర్మనెంట్ ఇలా అనేక విధాలుగా వస్తుండటంతో టాటూ లవర్స్ ఫిదా అవుతున్నారు. గతంలో డిజైనర్లు టాటు కోసం పచ్చ రంగు మాత్రమే ఉపయోగించగా, ఇప్పుడు అనేక రకాల రంగులను వినియోగించి యూత్‌ను ఆకట్టుకుంటున్నారు. మల్టీకలర్స్‌తో లైఫ్ లాంగ్ గుర్తుండేలా వేసుకోవడం ఎంతో క్రేజ్‌గా మారింది.

వెలిసిన సెంటర్లు …
గతంలో కేవలం నగరాలకే పరిమితమైన టాటూ కల్చర్ ప్రస్తుతం చిన్న పట్టణాలకు సైతం విస్తరించింది. ఒకప్పుడు జాతర్లలో ప్రత్యేక సమయంలో మాత్రమే పచ్చబొట్టు అందుబాటులో ఉండేది. నేడు టాటూలు వేసేందుకు ప్రత్యేక సెంటర్లు వెలిశాయి.
ఫెన్ లైన్ టాటూ…
విభిన్నమైన జంతువులు, పక్షులు, మనుషుల బొమ్మలను మీరనుకున్న థీమ్‌కు అనుగుణంగా మీ చేతులు లేదా భుజాల మీద వేయించుకోవచ్చు.
ట్రైబల్ టాటూ
సాలిడ్ గ్రాఫిక్ డిజైన్లతో మోడ్రన్ పెయింటింగ్స్‌ను శరీరంపై వేయించుకోవడం.
ట్రిబ్యూట్ టాటూ
ఏదైనా సంఘటనకు గుర్తుగానో లేదా ఇష్టమైన వారికి అంకితం చేస్తూ వేసుకుంటారు.
క్రేజ్ పెరిగింది
నేను చెన్నైలో టాటూ ఆర్ట్ నేర్చుకున్నాను. ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్రంలో బీ 24టాటూ షాప్ ప్రారంభించాను. బిజినెస్ మంచిగానే నడుస్తున్నది. టాటూ డిజైన్‌ను బట్టి 1వేయి నుంచి రూ. 8వేల వరకు ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం నేటి యువత టాటూలు వేసుకుంటున్నారు . ప్రస్తుతం యువతలో ఎంతో క్రేజ్ పెరిగింది.
– భానుప్రసాద్, టాటూ కళాకారుడు, యజమాని, మెదక్
ఫ్యాషన్‌గా ఉండడం ఇష్టం
ఫ్యాషన్‌గా ఉండటమంటే నాకిష్టం. అందుకు తగ్గట్టుగానే నేను టాటూ వేయించుకున్నాను. గతంలో హైదరాబాద్‌కు వెళ్లేవాడిని. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే టాటూ సెంటర్ ఏర్పాటు చేయడంతో యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. గతంలో కేవలం టాటూ గ్రీన్ కలర్లో అందుబా టులో ఉండేవి. ఇప్పుడు వివిధ రకాల రంగులు మార్కెట్లోకి వచ్చాయి.
– వినయ్ కుమార్, యువకుడు, మెదక్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- tattoos
- Tattoos In Youth
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

