పైసల వేటలో అభ్యర్ధులు
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరందుకున్నది. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, ఆయా పార్టీల నేతలు తమ అనుచరులను బరిలో దింపుతున్నారు. తొలి విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.రెండో విడత నామినేషన్లు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, పోటీచేసే అభ్యర్థులకు పైసల రంది పట్టుకుంది.
- సర్పంచ్ పదవికి ఉత్సాహంగా పోటీ.. చేతిలో డబ్బులు లేక అవస్థలు
- వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అభ్యర్థులు
- కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్
- అంతంతమాత్రంగానే వ్యాపారాలు
- మార్కెట్లో పైసలు పుట్టని పరిస్థితి
సిద్దిపేట, నవంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరందుకున్నది. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, ఆయా పార్టీల నేతలు తమ అనుచరులను బరిలో దింపుతున్నారు. తొలి విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.రెండో విడత నామినేషన్లు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, పోటీచేసే అభ్యర్థులకు పైసల రంది పట్టుకుంది.సర్పంచ్‌గా పోటీచేయాలనే ఆశతో నామినేషన్ దాఖలు చేస్తిమి…పదవి కావాలనే ఆశ ఎక్కువనే ఉంది. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో పైసలు లేనిది ఏం పనులు కావడం లేదు.ఎన్నికల ప్రచారానికి ఖర్చు భరించేందుకు పైసలు ఎట్లా అనే ఆలోచనలో అభ్యర్థులు పడ్డారు. గతంలో వ్యాపారాలు మంచిగా జరిగి నాలుగు రూపాయలు వెనుకేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ బాగా నడిచింది.
చాలామంది రియల్ఎస్టేట్ చేసి ఆర్థ్ధికంగా నిలదొక్కుకున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ పడిపోయి. వ్యాపారాలు సరిగ్గా సాగక చేతిలో పైసలు లేని పరిస్థితి ఉంది. దీంతో అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రంగంలోకి దిగాం.. ఎంత ఖర్చుకైనా సరే వెనుకడుగు వేసేది లేదంటూ తమ ఎన్నికల ప్రచారాన్ని మమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో సిద్దిపేట జిల్లాలో 163 సర్పంచ్‌లు, 1432 వార్డులు, మెదక్ జిల్లాలో 160 సర్పంచ్‌లు, 1402 వార్డులు, సంగారెడ్డి జిల్లాలో 136 సర్పంచ్‌లు, 1246 వార్డులకు శనివారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తొలి విడతకు డిసెంబర్ 11న ఎన్నికలు జరుగనున్నాయి.
రెండో విడత నామినేషన్లు షురూ..
రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. రెండో విడతలో సిద్దిపేట జిల్లాలో అక్బర్ పేట్ భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండలాల్లోని 182 గ్రామ పంచాయతీలు,306 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మెదక్ జిల్లాలో తూప్రాన్, మనోహరబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట (ఆర్), మెదక్ మండలాల్లోని 149 గ్రామ పంచాయతీలు, 1290 వార్డులకు, సంగారెడ్డి జిల్లాలో ఆందోల్, చౌటకురు, పుల్కల్, వట్ పల్లి, రాయికోడు, జరాసంగం, జహిరాబాద్, మొగుడంపల్లి, కోహిర్, మునిపల్లి మండలాల్లోని 243 గ్రామ పంచాయతీలు, 2164 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. డిసెంబర్ 14న రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి.
పోటీ చేద్దామన్న ఉత్సాహం… చేతిలో రూపాయి లేక పాయే..?
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వచ్చి పోటీచేద్దామనే ఉత్సాహం ఉన్నా, చేతిలో రూపాయి లేక చాలామంది నిరాశ చెందుతున్నారు.మొన్నటి వరకు తాజా మాజీగా ఉన్న సర్పంచ్‌లకు చాలాచోట్ల రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది. వారు సైతం పోటీకి సిద్ధవుతున్నారు. తాము గ్రామానికి సేవ చేశాం..మొన్నటి వరకు గ్రామానికి పెట్టిన డబ్బులు మాకు ఇంకా రావాలి…మాకు రావాల్సిన బిల్లులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని మాజీ సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. తమకు అవకాశం వచ్చి పోటీచేద్దామంటే చేతిలో రూపాయి లేక పాయే, బిల్లులు రాకపాయే అని ఆవేదన చెందుతున్నారు. తప్పక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను దీటుగా ఢీకొట్టాలంటే ఖర్చుకు వెనుకాడవద్దు.
రోజువారీగానే బాగానే ఖర్చు ఉంటుంది. క్యాడర్‌ను గట్టిగా కాపాడుకోవాలి అంటే వారికి అన్ని రకాలుగా చూసుకుంటేనే వెంట ఉంటారు. తేడా వస్తే మరుసటి రోజు ఇతర క్యాంపెయిన్‌లో చేరిపోతారు. ఇలా ఒకరికొకరు దీటుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయి. ఎన్నికల్లో బ్యానర్లు, వాల్ పోస్టర్లు, ప్రచార వాహనాలు, రోజు వారి క్యాండెట్ ఖర్చు, పోల్ మేనేజ్మెంట్తో పాటు మందు ఇతరత్రా ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. ఎంత లేదన్నా ఒక్కో అభ్యర్థి ఆయా గ్రామాల ఓటర్లను బట్టి లక్షల రూపాయలు ధార పోయాల్సిందే. ఇంత దారపోసినా రేపు ఫలితం ఏమి వస్తుందో తెలియని పరిస్థితి. వెయ్యి లోపల ఓటర్లు ఉన్న గ్రామాలకు ఎంత లేదన్నా రూ. 15 లక్షల పైమాటే. ఇలా చూసుకుంటు పోతే లక్షల ఖర్చు ఖావడం ఖాయం.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

