నర్సాపూర్, జనవరి 4 : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమలు మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటైన మత్స్య సంఘాలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జిల్లా మత్స్యశాఖ ఏడీఏ రజిని, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, నాయకులు కుమ్మరి నగేశ్, మత్స్య సహకార సంఘం నాయకులు ఉన్నారు.