రాయపోల్ : రైతు పొలంలో పంట పండించేది కేవలం తన కుటుంబం కోసమే కాదు. యావత్ సమాజానికి అన్నం పెట్టేందుకు. అలాంటి రైతు తన పంటను కాపాడుకునేందుకు అవసరమైన కరెంటు కోసం అధికారుల కాళ్లపై పడాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ హయాంలో దాపురించాయి.
సిద్దిపేట జిల్లా రాయపోల్ ( Rayapol ) మండలంలో విద్యుత్ ( Electricity ) కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతు రక్షణ సమితి అధ్యక్షుడు ఇప్ప దయాకర్ ( Ippa Dayakar ) రైతుల తరఫున అధికారులను కలిసి సమస్యను పరిష్కరించాల ని కోరారు. పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయి.
కరెంటు లేక రైతుల కష్టం వృథా అవుతోంది. వెంటనే విద్యుత్ సరఫరా చేయాలంటూ అధికారుల కాళ్లపై పడి వేడుకున్న దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. విత్తనం వేసింది రైతు. పంటను పెంచింది రైతు. నీళ్ల కోసం తపించింది రైతు. ఇప్పుడు కరెంటు కోసం కాళ్లు పట్టుకోవాల్సింది కూడా రైతేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కష్టానికి విలువ లేదా? పంట ఎండిపోతే రైతు కన్నీటికి బాధ్యత ఎవరిది? 24 గంటల విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీలు మాటల్లో కాకుండా పొలాల్లో అమలు అయి రైతు పంటను కాపాడాలని అధికారులను విన్నవించారు.