సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 10: సిద్దిపేట నుంచి జేబీఎస్‌కు వెళ్లే 10 డీలక్స్ బసుల్లో ఈ-టిమ్స్ డిజిటల్ పేమెంట్స్ మిషన్స్ ప్రవేశపెట్టామని సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు గురువారం తెలిపారు.
ప్రయాణికులు గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా టిక్కెట్లను పొంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని సూచించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.