నారాయణఖేడ్, ఏప్రిల్ 11: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామం లో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం తల భాగం పగిలిపోయి కింద పడి ఉంది. దీంతో శుక్రవారం బీఎస్పీ నాయకులతో పాటు పలు దళిత సంఘాల బాధ్యులు గ్రామానికి చేరుకుని విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నాయకులు విశ్వనాథ్, మారుతి, పండరి, భీమసేన తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులను అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు.