గజ్వేల్, నవంబర్ 24: ఎన్నికల సమయంలో గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, హామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపన్నగౌడ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఆర్అండ్ఆర్ కాలనీ వేములఘట్‌లో సోమవారం నిర్వహించిన గీత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేర్చి న్యాయం చేయాలన్నారు. కల్లు గీత వృత్తిపై 2.50లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయన్నారు.
మరో లక్ష కుటుంబాలు పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నాయ ని గుర్తుచేశారు. ప్రభుత్వం కల్లు గీతను ఆధునీకరణ చేయాలని, సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకోవాలన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన కల్లు గీత కుటుంబాలకు అండగా ఉండాలని, ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమిలో ఈత వనం,తాటి చెట్లు పెంచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో వృత్తిపై ఆధారపడి 300 కుటుంబాలు బతుకుతున్నాయన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలోని కల్లు గీత కార్మికుల కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ అందజేసి రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ఆదుకోవాలన్నారు.
లైసెన్స్‌లను బదిలీ చేయాలని కోరారు. కల్లు గీత కార్మికుల రాష్ట్ర మహాసభలు ఈ నెల 28,29,30 తేదీల్లో సూర్యాపేట జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్, ఆర్అండ్ఆర్ కాలనీ కల్లు గీత కార్మికులు కనకగౌడ్, యాదగౌడ్, కృష్ణాగౌడ్, స్వామిగౌడ్, వెంకటేశంగౌడ్, భాస్కర్‌గౌడ్, అంజాగౌడ్, నరేశ్‌గౌడ్, బాల్‌నర్సయ్య, భిక్షపతిగౌడ్, అశోక్‌గౌడ్, శ్రీనుగౌడ్, సాయిగౌడ్, రామగౌడ్, నవీన్‌గౌడ్ పాల్గొన్నారు.