వన మహోత్సవం..లక్ష్యానికి దూరం
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి లక్ష్యానికి మించి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో చెట్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుండేవి. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వనమహోత్సవం కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఆయా శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను నిర్దేశించింది.
- మొక్కలు నాటడంలో చిత్తశుద్ధి లేని శాఖలు
- 15 శాఖల్లో ఒక్క మొక్క నాటని వైనం
- కేవలం 125 మొక్కలు నాటిన మెదక్ మున్సిపాలిటీ
- వర్షాలు కురుస్తున్నా పట్టించుకోని అధికారులు
మెదక్, జూలై 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి లక్ష్యానికి మించి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో చెట్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుండేవి. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వనమహోత్సవం కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఆయా శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను నిర్దేశించింది.
మెదక్ జిల్లాలో వారం రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో మాత్రమే మొక్కలు నాటుతుండగా, మిగతా శాఖలు ఇప్పటికీ మొక్కలు నాటే కార్యక్రమంపై దృష్టిపెట్టలేదు. మెదక్ జిల్లాలో ఈ ఏడాది 34,08, 200 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వర కు కేవలం 9,80,628 లక్షలు మాత్రమే నాటినట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. అంటే వన మహోత్సవంపై అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధిలేదని స్పష్టమవుతోంది.
15 శాఖల్లో ఒక్క మొక్క నాటని అధికారులు
మెదక్ జిల్లాలో 23 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు 15 శాఖల్లో వన మహోత్సవాన్ని ప్రారంభించలేదు. ఇందులో వ్యవసాయశాఖ, బీసీ వెల్ఫేర్, విద్యాశాఖ, ఇరిగేషన్ శాఖ, మార్కెటింగ్ శాఖ, వైద్యారోగ్య శాఖ, మైన్స్ శాఖ, మైనా ర్టీ వెల్ఫేర్, తూప్రాన్ మున్సిపాలిటీ, పోలీసు శాఖ, ఎస్సీ వెల్ఫే ర్, ట్రైబల్ వెల్ఫేర్, టీఎస్ఎస్పీడీసీ, పశు సంవర్ధక శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో మా త్రం 75వేల మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 125 మొక్కలు నాటడం విడ్డూరంగా ఉంది.
ఆ రెండు శాఖలే మొక్కలు నాటుతున్నాయి…
2024-25 సంవత్సరానికి జిల్లాలో అత్యధికంగా గ్రామీణాభివృద్ధి శాఖకు 18 లక్షలు, అటవీ శాఖలకు 10 లక్షల మొక్క లు నాటే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటి వరకు ఆ రెండు శాఖ లు మాత్రమే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖలో 5.69 లక్షల మొక్కలు నాటగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో 4 లక్షల మొక్కలు నాటారు. వ్యవసాయ శాఖకు 25వేల మొక్కలు నాటాలని లక్ష్యం ఉండగా, ఒక్క మొక్క నాటలేదు. పరిశ్రమల శాఖకు 30వేల మొక్కలు నాటాలని ఉండగా, ఇప్పటి వరకు వెయ్యి మొక్కలు నాటారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 3వేల మొక్కలు నాటారు. రామాయంపేట మున్సిపాలిటీలో 25వేల మొక్కలకు 1500 మొక్కలు నాటారు. ఎక్సైజ్ శాఖకు 30 వేల మొక్కల లక్ష్యం కాగా, 3700 మొక్కలు నాటారు. ఇలాఅయితే లక్ష్యాలు ఎప్పుడు చేరుకుంటారని ప్రకృతి ప్రేమికులు పెదవి విరుస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

