మునిపల్లి, జులై 10 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసరెడ్డిపల్లి గ్రామ శివారులోని సింగూర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చే పర్యాటకులకు విశ్రాంతి తీసుకునేందుకు అనుకూలంగా గత ప్రభుత్వం బుసారెడ్డిపల్లి గ్రామ శివారులో తెలంగాణ హరిత రెస్టారెంట్ నిర్మాణం చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చింది. హరిత రెస్టారెంట్ వినియోగంలోకి తీసుకువచ్చిన కొత్తలో హరిత రెస్టారెంట్ వచ్చే పర్యాటకులకు రుచికరమైన భోజనాలతో కూడిన మౌలిక సదుపాయాలు ఉండేవి.
రాను.. రాజు గుర్రం గాడిదైనట్టు హరిత రెస్టారెంట్ వినియోగం పూర్తిగా అడ్డదారులకు ఉపయోగపడుతుందనే విమర్శలు స్థానికుల నుంచి కోడై కుస్తున్నాయి. హరిత రెస్టారెంట్లో ఈ మధ్యకాలంలో అధిక సంఖ్యలో పేకాట ఆడేవారికి, మందుబాబులు హరిత రెస్టారెంట్లోని గదులను అద్దె చెల్లించి ఇష్టానుసారంగా మద్యం సేవించి పేకాటలు అడి వెళ్లిపోతున్నారు.
హరిత రెస్టారెంట్లో గత ఆరు నెలల క్రితం ఇతర ప్రాంతాల నుంచి హరిత రెస్టారెంట్లో ఓ గది అద్దెకు తీసుకొని రాత్రి సమయంలో హరిత రెస్టారెంట్లో ఉండి మరుసరటి రోజు తెల్లవారు జామున ప్రేమజంట హరిత రెస్టారెంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. గత రెండు రోజుల క్రితం (బుధవారం) ఈ నెల 8న హరిత రెస్టారెంట్లో అద్దెకు గది తీసుకొని పేకాట ఆడుతున్న ఎనిమిది పేకాటరాయల్లో పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారిపై మునిపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎంతటి వారైనా చర్యలు తప్పవు : ఎస్ఐ అరవింద్
మునిపల్లి మండలంలో పేకాట ఆడేవారు ఎవరైనా సరే కేసు నమోదు చేస్తామన్నారు. పేకాట ఆడే వారు ఏంతటి వారైనా సరే కేసులు నమోదు చేయడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మునుపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోని ఫామ్ హౌస్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఉంది. పేకాట ఆడటంతో కుటుంబాలు రోడ్డున పడతాయి.పేకాట అడటం ఓ వ్యసనం. దాని వల్ల అప్పులు పెరిగి ఆత్మహత్యలు పెరుగుతాయి. పేకటాడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.