ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, నమస్తే తెలంగాణ, జూలై 24; ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొనిం టి మాణిక్‌రావు, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున కేకులు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పడమటి అనంత్‌రెడ్డి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసి పూలబొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.