మద్దూరు : సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ సందర్భంగా మేక సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాల కిటికీలు ధ్వంసమై పాడైన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం ను అందించాలని డిమాండ్ చేశారు.