వర్గల్, ఏప్రిల్ 28 : పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం- 2025 ను అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శాకారంలో జరిగిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూభారతి చట్టంలో సాదాబైనామాలకు పరిష్కారం చూపనున్నట్టు తెలిపారు. ఆయా అంశాలకు సంబంధించి భూ సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు. రైతుల భూసమస్యల విషయంలో అధికారులు ఆలస్యం చేసినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మం త్రులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి,మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, విజయ, నాయకులు ఎలక్షన్‌రెడ్డి,భూంరెడ్డి , నిమ్మరంగారెడ్డి, రైతులు , నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.