మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు శుభాకాంక్షల వెల్లువ మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు హైదరాబాద్‌లో పూలమొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సంగారెడ్డి జిల్లా కురుమసంఘం అధ్యక్షుడు బూరుగడ్డ నగేశ్ తదితరులు.
కోహీర్, జనవరి1: మండలంలోని పీచెర్యాగడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం చైర్మన్ స్రవంతిరెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ఉన్న సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు భగవద్గీత పుస్తకాన్ని సొసైటీ చైర్మన్ అందజేశారు.
సిద్దిపేట, జనవరి 1: మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును బీఆర్ఎస్ సిద్దిపేట నాయకులు మేర్గు మహేశ్, మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున్, బీఆర్ఎస్వీ నాయకులు పయ్యవుల శ్యామ్, దిలీప్‌రెడ్డి హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మేర్గు మహేశ్ రూపొందించిన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవిష్కరించారు.