ప్రాజెక్టుల కోసం ఉద్యమిస్తాం
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేపడతామని, ప్రభుత్వ తీరుపై ఉద్యమిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు.
- సంగమేశ్వర, బసవేశ్వర కోసం పాదయాత్ర చేపడతాం..
- రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ ప్రభుత్వం
- మాది చేతల ప్రభుత్వం.. ఇది చెత్త ప్రభుత్వం
- ధరలు పెంచు, కమీషన్లు దంచు విధానం మానుకోవాలి
- ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పకపోతే రైతుబంధు రాదు
- కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి
- మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నారాయణఖేడ్, నవంబర్ 30: సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేపడతామని, ప్రభుత్వ తీరుపై ఉద్యమిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో విలేకరుల సమావేశంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. రెండేండ్లు పూర్తయినా ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాల పనులు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఎనిమిది చెరువులు మంజూరు చేసి, భూసేకరణ సైతం పూర్తి చేసిందన్నారు.
కానీ, వాటి పనులు ముందుకు సాగడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లాపై ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. నారాయణఖేడ్- సిర్గాపూర్ రోడ్డు సహా అన్ని పనులు నిలిచిపోయాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో అద్దంలా మెరిసిన గ్రామాలు, కాంగ్రెస్ పాలనలో మురికిమయంగా తయారైనట్లు హరీశ్‌రావు తెలిపారు. గ్రామాల్లో కనీసం తాగునీరు సరిగ్గా సరఫరా కావడం లేదన్నారు. బీఆర్ఆస్ చేతల ప్రభుత్వమైతే, చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.
రైతుబంధు ఎగ్గొట్టే కుట్ర…
సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన ప్రకటనతో దీర్ఘకాలిక పంటలకు రైతుబంధు ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందనే విషయం స్పష్టమైందని హరీశ్‌రావు అన్నారు. మంత్రి ప్రకటనతో దీర్ఘకాలిక పంటలకు రైతు భరోసా నిలిచిపోతుందని, ఈ లెక్కన సుమారు 70 లక్షల ఎకరాలకు రైతుభరోసా రాదన్నారు. రైతు భరోసాపై విధానాన్ని స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, రైతు భరోసా సక్రమంగా రావాలంటే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులకు రూ.1150 కోట్ల సన్నవడ్ల బోనస్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సోయా, మొక్కజొన్న కొనుగోలు చేసిన రైతులకు 48 రోజులైనా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేవలం గ్రామాల్లో మాత్రమే చీరలు పంపిణీ చేస్తున్నారని, మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం 1.30 కోట్ల మందికి చీరలు పంపిణీ చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 50 లక్షల మందికి యూనిఫాం తరహా చీరలు పంపిణీ చేసిందన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్ నిలిపివేసిందన్నారు. పెండ్లి సందర్భంలో ఇవ్వాల్సిన కల్యాణలక్ష్మి చెక్కులను బారసాలకు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.ఈ ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదని మండిపడ్డారు.
బస్సు చార్జీలు, లిక్కర్ ధరలు, విత్తనాల ధరలు పెంచి ధరలు పెంచు.. కమీషన్లు దంచు అనే విధానాన్ని రేవంత్ సర్కారు అవలంబిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ భరోసా ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి భరోసా ఇస్తున్నదని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగడతామని హరీశ్‌రావు హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు మల్కాపురం శివకుమార్, మఠం భిక్షపతి, శ్రీకాంత్‌గౌడ్, మోయిద్‌ఖాన్, బీఆర్ఎస్ నారాయణఖేడ్ మండల అధ్యక్షుడు పరమేశ్, పట్టణ అధ్యక్షుడు నగేశ్, నాయకులు రవీందర్‌నాయక్, ఎం.ఏ.నజీబ్, అభిషేక్‌శెట్కార్, విజయ్ బుజ్జి, సంగప్ప, వెంకటేశం, సిద్దు, రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

