మెదక్ అర్బన్/సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 27: కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షకు మెదక్ జిల్లాలో 8821 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. మెదక్‌లో 17, నర్సాపూర్‌లో 5, రామాయంపేటలో 4, చేగుంటలో 2 కేంద్రాలు ఏర్పాటుచేశారు.
సంగారెడ్డి జిల్లాలో 43 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 18,451 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి గుర్తింపు కోసం బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోనున్నారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి గంట ముందుగానే అనుమతించనున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమలుల్లో ఉంటుంది. పరీక్ష నోడల్ అధికారిగా జహీరాబాద్ డీఎస్పీ రఘును నియమించారు.