మెదక్‌లో ప్రాచీన రామాలయం
మెదక్‌లో భద్రాచలం లాంటి రామాలయం ఉన్నది. ఈ ఆలయంలోని రాముడు భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లు తున్నది. భద్రాచల రామాలయంలో ఎడమ తొడ మీద సీతమ్మను కూర్చోబెట్టుకున్న మూర్తి తరహాలో మెదక్ పట్టణంలోని బ్రాహ్మణ వీధి లోని రామాయలంలో నిర్మించారు.
- సుమారు 300 ఏండ్ల చరిత్ర
- కోరిన భక్తుల కొంగుబంగారం
- నేడు మాధవానంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
జనవరి 21 (నమస్తే తెలంగాణ): మెదక్‌లో భద్రాచలం లాంటి రామాలయం ఉన్నది. ఈ ఆలయంలోని రాముడు భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లు తున్నది. భద్రాచల రామాలయంలో ఎడమ తొడ మీద సీతమ్మను కూర్చోబెట్టుకున్న మూర్తి తరహాలో మెదక్ పట్టణంలోని బ్రాహ్మణ వీధి లోని రామాయలంలో నిర్మించారు. బ్రాహ్మణ వీధిలోని ఈ రామాలయంలో రోజూ వైఖానస ఆగమ పద్ధతిలో రాములోరు పూజలు అందుకుంటున్నారు. ఇలాంటి పురాతన దేవాలయం మూర్తిలో తేజస్సు ఉంటుంది.
320 ఏండ్ల క్రితం నిర్మాణం
ఇక్కడి రామచంద్రమూర్తి సుమారు 320 ఏండ్ల క్రితం మెదక్ పట్టణ వాస్తవ్యుడు సింగనాచార్యులకు స్వప్నంలో సాక్షాతరించి, తన ఆలయం నిర్మించమని చెప్పారట. అప్పటి నుంచి సింగనాచార్యులు తన సర్వస్వాన్ని ధార బోసి రాయి కట్టడంతో పూర్తి ఆగమశాస్త్ర బద్ధం గా ఆలయాన్ని నిర్మించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని వైఖానస ఆగమ శాస్త్ర పండితులను పిలిపించి వారితో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి తరించాడు. వారి వంశీకులు శ్రీనివాసాచార్యులు, తాయమ్మ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పురోహితుడు వైద్య రామచంద్రయ్య ఆలయంలో జరిగే కల్యాణ మహోత్సవానికి పౌరోహిత్యం చేశారు. నేటికీ వారి మునిమనుమలు వైద్య రాజుపంతులు, వైద్య శ్రీనివాస్ పంతులు ఆధ్వర్యంలో ప్రాచీన రామాలయం లో వివాహ తంతు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ వంశానుగత ధర్మకర్త నేరెళ్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు, నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆలయంలో పూజా కార్యక్రమాలు వైఖానస ఆగమ పద్ధతిలో నిర్వహించడం ఆచారంగా వస్తుంది.
నేడు మాధవానందసరస్వతీస్వామి రాక
మెదక్‌లోని రామాలయంలో సోమవారం మాధవానందసరస్వతీస్వామి ఉదయం 7 గం టలకు రాముడిని దర్శించి పుష్పార్చన చేయనున్నారు. భక్తులు అందరూ ఉపస్థితి కావాలని పురోహితుడు వైద్య శ్రీనివాస్ తెలిపారు. ప్రా చీన రామాయలంలోని రామచంద్రమూర్తిని దర్శించుకుని పుణీతులు కావాలన్నారు. భక్తులకు కొంగు బంగారంగా స్వామివారు నిలుస్తున్నారని పురోహితుడు శ్రీనివాస్ తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

