Grocery store | ఓ కిరాణ దుకాణంలో ఫ్రిజ్ పేలి షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేటలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం షాపులో ఒక్కసారిగా ఫ్రిజ్ పేలి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని తెలిపారు. పూర్తి వివవరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..