మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Medak - Sep 16, 2020 , 03:12:47

ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి

ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి

  • మండలిలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి

మెదక్‌ : జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత పట్టణంలో ట్రాఫిక్‌ రద్దీ పెరిగిందని ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మెదక్‌ టౌన్‌లో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు గురించి చర్చ జరుగగా హోంమంత్రి మహమూద్‌అలీ దృష్టికి మెదక్‌ ట్రాఫిక్‌ సమస్యను తీసుకెళ్లారు. పట్టణంలోని ట్రాఫిక్‌ సమస్యను  ప్రస్తావించిన ఎమ్మెల్సీ పట్టణంలో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను  ఏర్పాటు చేయాలని గతంలో ఉన్న ట్రాఫిక్‌ సిగ్నల్‌ పని చేయడం లేదని ,వాటిని పునరుద్ధరించి రద్దీ చౌరస్తాలో సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.కొత్త జిల్లా ఏర్పడినప్పటికీ పోలీసు సిబ్బందిని మాత్రం పెంచలేదని, జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని కోరారు. దీంతో పాటు రాష్ట్రంలోని 11జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు లేవని, ఆ స్థానంలో కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఔటర్‌ రింగురోడ్డు తర్వాత ట్రాఫిక్‌ పోలీస్‌ లేకపోవడంతో నిజామాబాద్‌, నాగపూర్‌ రహదారిపై ట్రాఫిక్‌ అదుపుతప్పుతుందని సభదృష్టికి తెచ్చారు. ట్రాఫిక్‌ రద్దీని గుర్తించి ట్రాఫిక్‌ పోలీసులను నియమించాలని హోం మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ ప్రశ్నలకు హోంమంత్రి మహమూద్‌అలీ బదులిస్తూ ఒక ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ఏర్పాడిన తరువాత 9 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.logo