నూతనోత్సాహం

- రూ.5 కోట్లతో అంబేద్కర్ స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం
- చెన్నూరులో విప్ సుమన్ చేతులమీదుగా శంకుస్థాపన..
- నైపుణ్యాభివృద్ధితో ఉపాధి అవకాశాలు
- విద్యార్థులు, నిరుద్యోగులకు బాసట
మంచిర్యాల, జనవరి 23( నమస్తే తెలంగాణ) : చెన్నూర్ నియోజకవర్గంలో నిరుపేద యువతకు, నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వవిప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ అడుగులు వేస్తున్నారు. ఇక్కడి యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కోచింగ్ సెంటర్లు, ప్రత్యేక కేంద్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి, చెన్నూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.5 కోట్ల నిధులతో, అన్ని హంగులతో భవన నిర్మాణానికి ఈనెల 5న భూమిపూజ చేశారు.
నిరుద్యోగ యువతకు మేలు..
ముఖ్యంగా చెన్నూరు మున్సిపాలిటీతో పాటు కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల విద్యార్థులు, నిరుద్యోగ యువత శిక్షణ కోసం వివిధ పట్టణ ప్రాంతాలకు తరలివెళ్తుంటారు. ఈ నేపథ్యంలో చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, యువతకు మేలు జరుగుతుంది. నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో వివిధ రంగాల్లో ప్రావీణ్యం ఉన్న శిక్షకులతో ప్రత్యేక శిక్షణ అందజేయడంతో లాభం చేకూరుతుంది.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం..
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా ధ్యేయం. ‘నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అని అంబేద్కర్ సూచించినట్లు ప్రజల క్షేమం కోసమే అహర్నిశలూ కృషి చేస్తున్నాను. యువతరానికి మేలు చేయాలనే ఉద్దేశంతో రూ. 5కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. వీలైనంత త్వరగా భవనం పూర్తి చేసి సెంటర్‌ను ప్రారంభిస్తాం.
- బాల్క సుమన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, చెన్నూర్పట్టుదల,
నైపుణ్యంతో విజయం..
ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో వృత్తిపని, ఉపాధి వైపు దృష్టి పెట్టి చాలా మంది సొంతూరు బాట పట్టారు. పట్టుదల, నైపుణ్యం, ప్రవర్తన మూలంగా విజయాలను దక్కించుకోవచ్చని మాత్రం యువత తెలుసుకున్నది. కొవిడ్ 19 ప్రభావంతో దేశంలో ముఖ్యంగా ప్రైవేట్ రంగం చిన్నాభిన్నమైంది. ఉపాధి అవకాశాలు లేక చిరుద్యోగులు ఒడ్డున పడ్డ చేపలా విలవిల్లాడారు. చిన్నచిన్న ప్రైవేట్ సంస్థలు, పాఠశాలు మూసివేయడంతో వేలాది మంది ప్రైవేట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సరికొత్త పాఠాన్ని నేర్పింది. పలు రంగాల్లో ప్రావీణ్యం, తగిన నైపుణ్యంలేని, వేలాది మంది మాత్రం కష్టాలెదుర్కొంటున్నారు.
ఎవరో వేసిన సంకెళ్లను వారినే వచ్చి తీసివేయమని ప్రాధేయపడడం కంటే, సత్తా పెంచుకొని తమంతట తామే ఛేదించుకోవడం మంచిది.
-బాబా సాహెబ్ అంబేద్కర్
తాజావార్తలు
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
- చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ 75 నిమిషాల సంభాషణ
- గజకేసరిగా యష్ ..సాయంత్రం చిత్ర టీజర్ విడుదల
- రెండు తలల దూడకు జన్మనిచ్చిన బర్రె.. ఎక్కడో తెలుసా?
- బీజేపీని సవాల్ చేస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీయే : కేజ్రీవాల్