ఊటూర్, జూన్ 23 : అంతర్జాతీయ పరుగు పోటీలో నారాయణపేట జిల్లా ఊటూర్ మండలం ని డుగుర్తి గ్రామానికి చెందిన గణేశ్ ప్రతిభ చాటి బంగారు పతకం సాధించాడు. యూత్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-20 పరుగు పందెం పోటీలను నేపాల్ పోక్రా స్టేడియంలో ఈనెల 20నుంచి 24వరకు నిర్వహించారు. 400 మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్న గణేశ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.