చిన్నంబావి, మే 24 : మండలంలోని లక్ష్మీపల్లి లో బుధవారం రాత్రి బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్‌రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘ టనా స్థలాన్ని ఎస్పీ రక్షితామూర్తి, డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐ నాగభూషణంతో కలిసి శుక్రవారం పరిశీలించారు. హత్య జరిగిన స్థలం, చుట్టుపక్కల పరిసరాలు, డాగ్‌స్కాడ్ తిరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణం గా పరిశీలించారు. అనంతరం చిన్నంబావి పోలీస్‌స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలను డీఎ స్పీ, సీఐ, ఎస్సైలతో కలిసి చర్చించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు. ఆమె వెంట ఎస్సై పబ్బతి రమేశ్, సిబ్బంది ఉన్నారు.