మదనాపురం, జూన్ 16 : సరళాసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివా రం మండలంలోని తిర్మలాయపల్లి శివారులోని భీ మా ఫేజ్-2, సరళాసాగర్ పంప్‌హౌజ్‌లో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పూజలు చేసి ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకాలంలో సాగునీరు, విద్యుత్, ఎరువులు అం దించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సరళాసాగర్ ప్రాజెక్టు కింద 10 గ్రామాల్లో 4వేల ఎకరాలకు పై గా ధాన్యం పండిస్తున్నారని, చివరి ఆయకట్టు వర కు సాగునీరు అందించేలా అధికారులకు సూచించామన్నారు. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్ల రిపేరు చేయించేందుకు అధికారులు నివేదికలు అందజేస్తే, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు తీసుకొస్తామ ని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, మార్కెట్ క మిటీ మాజీ చైర్మన్ వెంకట్‌నారాయణ, మాజీ వైస్ ఎంపీపీ శంకర్‌యాదవ్, నీటి తీరువా సంఘం అధ్యక్షుడు వెంకటన్న, నాయకులు నాగ న్న, మణివర్ధన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జగదీశ్, కృష్ణ, రామకృష్ణ, మహేశ్, రంగన్న, శ్రీధర్‌రెడ్డి, రాములుగౌడ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.