అమ్రాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాలో పిడుగులు, మెరుపులతో అకాల వర్షం కురిసింది. మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లాలో పిడుగుపడి (Lightning) ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్రాబాద్ ఉమ్మడి మండలంలోని పదర కోడోనిపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగుపడింది. కండ్లగుంట గ్రామ సమీపంలో వేరుశనగ పంట పొలాల్లో కూలి పనులు చేస్తుండగా పిడుగుపడి సుంకరి సైదమ్మ, వీరమ్మ అనే కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా సుంకరి లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి.