మహబూబ్‌నగర్/వనపర్తి టౌన్, ఆగస్టు 18 : నీవు నా కు రక్ష నేను నీకు రక్షా.. అంటూ జరుపుకొనే పండుగ రక్షాబంధన్. ఈ పండుగ అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఎంత దూరానా ఎంత బిజీగా ఉన్నా ఏటా పండుగ రోజున అక్కా చెల్లెళ్లు అన్నాదమ్ములకు రాఖీలు కట్టి వారి అనుబంధాన్ని చాటుకుంటారు. సోదరుడి ప్రతిఅడుగు విజయం వైపు సాగాలని ఉ న్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది. దీనికి బదులుగా సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని సోదరుడు వాగ్దానం చేస్తూ కానుకలు అందిస్తారు.
పురాణ ఇతిహాసాల్లో రాఖీ గురించి అనేక కథలు ఉ న్నాయి. రాక్షసులు, దేవతలకు జరుగుతున్న యుద్ధంలో రాక్షస సంహారణ చేసే సందర్భంలో ఇంద్రుడు రాక్షసులను సంహరించడం వీలుకాక అమరావతిలో దాచుకుంటాడు. ఇంద్రుడి సతి అయిన ఇంద్రాణి రాక్షసుడిని సంహరించడానికి ఇంద్రుడికి ప్రేరణ కలుగజేస్తుంది. అందులో భాగంగా పార్వతి, లక్ష్మీదేవీలు శ్రావణబౌద్ధ రాఖీ పౌర్ణమిన ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంద్రుడికి రాఖీ కట్టి రాక్షసులను సంహరించడానికి పంపగా రాక్షసుడిని వధించి దేవతలకు అధిపతిగా ఇంద్రుడు నిలుస్తాడు. దీంతో నాటి నుం చి నేటి దాకా రాఖీ పౌర్ణమి జరుపుకోవడం ఆనవాయితీ అని చెబుతున్నారు.
అదేవిధంగా శ్రీకృష్ణుడు రాక్షసుడిని సంహరించడానికి సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడని ఆనాటి నుంచి రాఖీ పండుగ ప్రాచుర్యంలో ఉన్నది కూడా చెబుతారు. మరో చరిత్రలో ప్రపంచాన్ని జయించాలనుకున్న గ్రీకు రాకుమారుడు అలెగ్జాండర్ భారత్‌పై దండెత్తినప్పుడు జీలం నది ఒడ్డున పురుషోత్తమునితో యుద్ధం జరుగుతున్న సమయంలో అలెగ్జాండర్ భార్య రుక్సానా తన మేలుకోరి భారత ఉపఖండం వాయువ్య భాగాన్ని పా లిస్తున్న రాజు పురుషోత్తమునికి రాఖీ కడుతుంది. సోదరి సౌభాగ్యం కోరి పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను ప్రాణాల తో విడిచిపెట్టాడని చరిత్ర చెబుతున్నది. ద్వాపర యుగం లో కృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపదిదేవి తన చీర కొంగును చింపి గాయానికి కడుతుంది. దీం తో దానినే రక్షగా రాఖీగా పిలుస్తున్నారు.
ఒకప్పుడు నూలు దారంతో రాఖీలు తయా రు చేస్తుండగా.. ప్రస్తుతం వివిధ ఆకృతుల్లో ఆకర్షణీయమైన రూపాల్లో లభ్యమవుతున్నాయి. చి న్నారుల నుంచి వృద్ధుల వరకు ఈ పండుగను ఉ త్సవంలా ఉత్సాహంగా జరుపుకొంటారు. ఆకట్టుకు నే ఆకృత్తుల్లో రాఖీల తయారీకి జైపూర్, కోల్‌కతా, ముంబై ప్రసిద్ధి అక్కడి నుంచే ఎక్కువగా దిగుమతి అవుతాయి. గతంలో జైపూర్ మెరుపు కాగితాన్ని వివిధ ఆకారాల్లో చుట్టి వాటికి మెరుపులు అద్ది ఓం, స్వస్తిక్, సూర్యుడు. గణపతి, ఆకారాలు కలిగిన బిళ్లలు మధ్యలో అమర్చేవారు. ఇప్పుడు కోల్‌కతా నుంచి వచ్చే రాఖీలు కూ డా ఇలాగే సంప్రదాయ రీతిలో తయారు చేస్తున్నారు.
పూ సలు, కలశం, శంఖు, చక్రాలు, గణపతి ఆకారం, స్వస్తిక్, ఓం తదితర రూపాల్గో రాఖీలను తయారు చేస్తున్నారు. వీటి ధర కాస్త ఎక్కువే రూ.40నుంచి రూ.100వరకు ప లుకుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. దూది, దారంతో తయారు చేసిన రాఖీలు చేతికి అందంగా కనిపిస్తాయి. చిన్నారుల కోసం టీవీల్లో వచ్చే బాల గణేశ్, చోటా భీం, బెన్‌టెన్, మిక్కీమౌస్, ఫ్యాషన్ బోటిక్, యా క్సెసరీస్, మోటుపత్లు, ఐస్‌క్రీమ్ కప్, లిటిల్ గణేశ్ తదితర రకాల రాఖీలు మార్కెట్లో లభిస్తున్నాయి. డిజైన్లను బట్టి రూ.10 నుంచి రూ. 2వేలు ధర ఉన్న రాఖీలు అందుబాటులో ఉన్నాయి. వెండి, బంగారు తొడుగులతో ఉన్న రా ఖీలు కూడా మార్కెట్లో ఉన్నాయి.