నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13: ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ పాలిసె ట్-2025 ప్రవేశ పరీక్ష మంగళవారం ఉమ్మడి జి ల్లావ్యాప్తంగా సజావుగా సాగింది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు పరీక్షను నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఐ దు కేంద్రాల్లో పరీక్షను నిర్వహించినట్లు జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌బాబు తెలిపారు. మొత్తం 5 కేంద్రాల్లో 3381 మంది అభ్యర్థులకు గానూ 3190 హాజరు కాగా 191 మంది గైర్హాజరయ్యారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో 10 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 2756 మంది విద్యార్థులకు గానూ 2592 మంది హాజరుకాగా 164 మంది గైర్హాజరయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోనూ నాలుగు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 1780 మంది విద్యార్థులకు గా నూ 1702 హాజరుకాగా 78 మంది గైర్హాజరయ్యా రు. నారాయణపేట జిల్లాలోనూ నారాయణపేట పట్టణంలో మూడు, కోస్గిలోని రెండు కేంద్రాల్లో ప రీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 1382 మంది వి ద్యార్థులకు గానూ 1302 మంది హాజరుకాగా 79 మంది గైర్హాజరయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 2805 మంది వి ద్యార్థులకు గానూ 2,629 మంది హాజరుకాగా 176 మంది గైర్హాజరయ్యారు.