వనపర్తి రూరల్, మార్చి 6: మహిళా సంఘాల సభ్యులు వ్యాపారంపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం పలు అవకాశాలను కల్పిస్తున్నది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ.3లక్షల రుణం కల్పించి, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మెడికల్‌కు సంబంధించిన వారు విద్యార్హత కలిగి ఉంటే జనరిక్ మందుల దుకాణం పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగా వనపర్తి జిల్లాలోని ఆయా మండలకేంద్రాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద మూడు జనరిక్ మెడికల్ దుకాణాలు నడుపుకొనే అవకాశం ఉంది. ఆస్తకిగల మహిళా సంఘాల సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
స్త్రీనిధి ద్వారా రూ. 3లక్షల రుణం
జిల్లావ్యాప్తంగా ప్రజలకు జనరిక్ మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతున్నది. మహిళా సంఘాల సభ్యుల్లో అర్హులకు దుకాణాల ఏర్పాటుకు స్త్రీనిధి రుణాలను ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఒక్కో దుకాణం ఏర్పాటుకు రూ.3లక్షల రుణం అందించనున్నారు. ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద మూడు జనరిక్ మెడికల్ దుకాణాల ఏర్పాటు ప్రణాళిక సిద్ధం చేశారు.
దుకాణాల మంజూరు ఇలా…
ఆర్థికంగా ఎదిగేందుకే..
జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు స్త్రీనిధి ద్వారా తక్కువ వడ్డీకే ఇస్తున్న రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలి. కుటుంబంలో ఎవరైనా దుకాణం ఏర్పాటుకు అవసరమైన విద్యార్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. రుణాన్ని సులభ వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసలుబాటు ఉంటుంది.
-ఎల్లప్ప, స్త్రీనిధి మేనేజర్, వనపర్తి జిల్లా