అంకెల గారడీలా రాష్ట్ర బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగా మారింది. ఆరు గ్యారెంటీల పేరుతో అంకెల గారడీతో పసలేని బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులు, వృత్తిదారులకు, సంక్షేమానికి, వెనుకబడిన వర్గాల ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వలేదు.
- రైతులు, కులవృత్తిదారులకు మంగళం
- ఊసేలేని గొర్రెలు, దళితబంధు పథకాలు
- కనిపించని పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం
- పాలమూరు ఎత్తిపోతల, పర్యాటక రంగానికి చోటేదీ?
నాగర్‌కర్నూల్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగా మారింది. ఆరు గ్యారెంటీల పేరుతో అంకెల గారడీతో పసలేని బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులు, వృత్తిదారులకు, సంక్షేమానికి, వెనుకబడిన వర్గాల ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ బడ్జెట్ అంకెల గారడీగా.. అప్పులు పత్రంగానే మారిందని, పలువురు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అంకెల గారడీ.. సంక్షేమం మిథ్య
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా మారిందనే అభిప్రాయం మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పా లన అంటూ రోజూ వినిపించే కాంగ్రెస్ ప్రజాప్రతినిధు లు ఆచరణలో బడ్జెట్ సాక్షిగా తిలోదకాలిచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్ రూ.2.91లక్షల కోట్లు ఉండగా వ్యవసాయానికి రూ.72వేల కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కాగా రైతు రుణమాఫీకే రూ.30వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇక రైతు భరోసా, ఇతర పథకాలకు రూ. 20వేల కోట్ల మేర ఖర్చు అవుతుంది. దీంతో మిగిలిన రూ.20వేల కోట్లు మాత్రమే వ్యవసాయానికి కేటాయించినట్లుగా బడ్జెట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక వృత్తిదారులు, విద్యాభరోసాపై ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, ఆటో డ్రైవర్ల గురించి కూడా పేర్కొనలేదు. మహాలక్ష్మి, పింఛన్ల పెం పును ప్రస్తావించలేదు. పాలమూరులో ప్రతిష్టాత్మకంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 80 శాతంపైగా పూర్తి చేసింది. కల్వకుర్తి ఎత్తిపోతలను కూడా 2025వరకు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని, ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, ఇతర ఎత్తిపోతల పథకాలను చేపడతామని ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మారాయన్న విమర్శలు జిల్లా రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి.
ప్రతిష్టాత్మక పాలమూరు ప్రాజెక్టుపై ఇప్పటి వరకూ ప్ర స్తావించేందుకు అంతగా ఇష్టపడని ప్రభుత్వం బడ్జెట్లోనూ నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వకపోవడంపై జిల్లా రైతన్నల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. విప్లవాత్మకమైన దళితబంధును సైతం ప్రస్తావించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి రూ.50 వేల కోట్లను కేటాయిస్తే దళితులకు రూ.30వేల కోట్లుగా ప్రకటించడం వి డ్డూరమనే భావన వ్యక్తమవుతోంది. వృత్తిదారులైన గొ ర్రెల కాపర్లకు అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకాన్ని విస్మరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక మత్స్యకారు ల భరోసాకూ చోటు దక్కలేదు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోకు దూరంగా ఈ బడ్జెట్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రేషన్ కార్డుల గురించీ పేర్కొనలేదు. జాబ్ క్యాలెండర్, 2లక్షల ఉద్యోగాలు, రూ.4వేల నిరుద్యోగ భృతిని కూడా పేర్కొనలేదు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో పేర్కొన్నా ఆటో డ్రై వర్లను విస్మరించడం గమనార్హం. వాస్తవాలకు దూరం గా ఈ బడ్జెట్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అటవీ ప్రాంతంలో మంత్రుల బృందం పర్యటించింది. కానీ ఏం చేస్తామనే, ఎంత నిధులు కేటాయిస్తారో స్పష్ట త ఇయ్యలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏం చేస్తామో ఈ బడ్జెట్ స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం విస్మరించి, అభివృద్ధికి దూరంగా, అప్పుల పత్రానికి దగ్గరగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలకు ప్రాధాన్యతగానే మిగిలిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆశాజనకంగా లేదు..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు చాలా ఆశలు చూపింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే ప్రజలకు ఆశ చాక్లెట్ చేతిలో పెట్టినట్లు ఉంది. అంకెలగారడీని ప్రదర్శించి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. దళితులకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తే ఈ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఈ బడ్జెట్లో కార్యరూపం దాల్చుతోందని రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నా జిల్లాకు ఒరిగిందేమీలేదు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం పథకాల్లో కూడా కోతలు పెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీతో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడింది. ఈ బడ్జెట్‌తో రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశం ఉంది.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మేనిఫెస్టోని మరిచిన బడ్జెట్
కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశ పెట్టిం ది ప్రజావ్యతిరేక బడ్జెట్. ఎన్నికల మేనిఫెస్టోను కూ డా మరిచిపోయిం ది. నిరుద్యోగ భృ తి, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు, రేషన్ కా ర్డుల అంశాన్ని ప్రస్తావించలేదు. దళితుల ను, గొల్లకురుమలను విస్మరించింది. కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు, గొర్రెల పంపిణీతో దళితులు, కాపర్లలో ఆర్థిక స్థిరత్వం వచ్చింది. ఇలాంటి ప్రతిష్టాత్మక పథకాల ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం దు ర్మార్గం. ఈ బడ్జెట్ ప్రజాపాలనకు ప్రతిబింబంగా కాదు పేదవర్గాల సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చింది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇచ్చిన హామీలను కూడా అమ లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న విషయం ఈ బడ్జెట్ ద్వారా తెలిసి వచ్చింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకూ బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రజాపాలన అని చెప్పుకునే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
– బైకని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి
ఇది ప్రజావ్యతిరేకమైనది..
కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జె ట్ ప్రజల ఆశలపై నీళ్లు చ ల్లింది. ఇప్పటి వరకు రైతులకు వరమనుకుంటున్న రైతుభరోసాపై కోతలు విధిస్తున్నట్లు చెప్పారు. అనేక పథకాలకు తిలోదకాలు ఇ చ్చారు. అన్ని వర్గాలను ప్ర జలను మోసం చేసింది. ఇ ది మొత్తంగా ప్రజావ్యతిరేక బడ్జెట్‌లా ఉంది. కాం గ్రెస్ బడ్జెట్ అందరినీ నిరాశపర్చింది.
– బాసు హనుమంతు, బీఆర్ఎస్ నేత, గద్వాల జిల్లా
ప్రజలకు ఉపయోగపడేలా లేదు..
రాష్ట్ర బడ్జెట్ అంకెల్లో బాగుంది. కానీ ప్రజలకు ఉపయోగపడేలా లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు చేయడానికి బడ్జెట్లో నిధుల రూపకల్పన చేయలేదు. ఈ బడ్జెట్ పూర్తిగా రైతు, బడుగు, బలహీ న వర్గాలకు వ్యతిరేకంగా ఉంది. గత ప్రభుత్వం రెండు విడుతల్లో రైతులకు రైతుబంధు ఇస్తే ఈ ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు కేటాయించిం దే తప్పా ఈ పథకానికి ఇన్ని నిధులు కేటాయిస్తున్నామని ఎక్కడా వివరాలు పేర్కొనలేదు. రైతుబంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది. రోడ్ల అభివృద్ధికీ అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు ఒక పాలసీ లేదు. ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను వంచించే బడ్జెట్ తప్పా మరొకటి కాదు. ఇక్కడి ప్రజాప్రతినిధి అభివృద్ధి కోసం పార్టీ మారానని చెబుతున్నాడని, అయితే ఈ బడ్జెట్లో నెట్టెంపాడ్ పరిధిలో పెండింగ్ పనులకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలి.
– నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బీఆర్ఎస్ నేత, జోగుళాంబ గద్వాల జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

