కొల్లాపూర్, జూన్ 9: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం ఆర్డీవో హనుమానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సంక్షేమ సంబురాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ రంగానికి బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ.2లక్షల 26వేల కోట్లు కేటాయించారని గుర్తు చే శారు. తొమ్మిదేండ్లల్లో సంక్షేమానికి ప్రభుత్వం రూ.2.29లక్షల కోట్లు ఖర్చు చే సిందన్నారు. రానున్న రోజుల్లో కొల్లాపూర్ మహాజంక్షన్గా అవతరించబోతుందన్నారు. నవాజ్ కట్ట రోడ్డును వెడ ల్పు చేయించి మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చుతామన్నారు. ధరణిపై ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టడం సరికాదన్నారు. అరకొర సమస్యలు సహజమని.. దా న్ని బూతద్దంలో చూపెడుతూ రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. అనంతరం 250మందికి కల్యాణలక్ష్మి, 88మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కొల్లాపూర్, బొల్లారం, చౌటబట్ల, యాపట్లకు చెందిన 104 మందికి ఇండ్ల పట్టాలను అందజేశారు. అనంత రం దళితబంధు ట్రాక్టర్ల ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని ట్రాక్టర్ నడిపారు. కార్యక్రమంలో తాసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.